పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సమాయత్తం అవుతోంది. భద్రతా బలగాలు కీలక చర్యలకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సమాచార, ప్రసారశాఖ ప్రకటన విడుదల చేసింది. మీడియా సంస్థలు.. రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని సూచించింది. వీటితో పాటు పలు అంశాలను ప్రస్తావించింది.
కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలు చేసిన సూచనలు
⦿ జాతీయ భద్రత దృష్ట్యా.. అన్ని మీడియా ప్లాట్ ఫారమ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా యూజర్లు.. రక్షణ, ఇతర భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను ప్రసారం చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలకు కట్టుబడి వార్తలను ప్రసారం చేయాలి.
⦿ ప్రత్యేకంగా రక్షణ కార్యకలాపాలు, కదలికలకు సంబంధించి రియల్ టైమ్ కవరేజ్, విజువల్స్ టెలీకాస్ట్ అనేది సోర్స్, సమాచారం అంటూ ప్రసారం చేయకూడదు. సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేయడం వల్ల శత్రుమూకలు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. రక్షణ సిబ్బంది భద్రతకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
⦿ గతంలో ఇలాగే ప్రత్యక్ష ప్రసారాల కారణంగా ఉగ్రమూకలు అలర్ట్ అయ్యాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ లాంటి ఘటనకు సంబంధించి నిరంతర లైవ్ కవరేజ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు కలిగాయి. బాధ్యతాయుతమైన కవరేజీ ముఖ్యం అనేది గుర్తుంచుకోవాలి.
⦿ జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా, డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. మన దళాల భద్రతను రాజీ పడకుండా చూసుకోవడం మీడియా సంస్థల నైతిక బాధ్యతగా గుర్తుంచుకోవాలి.
⦿ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని టీవీ ఛానెల్లకు, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021 నియమం 6(1)(p)కి కట్టుబడి ఉండాలని ఇప్పటికే సలహాలు జారీ చేసింది. దీని ప్రకారం.. భద్రతా దళాలు చేసే ఏదైనా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని చేయకూడదు. మీడియా కవరేజ్ అనేది ఆయా ఘటనలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన బ్రీఫింగ్ మేరకే ఉండాలి.
⦿ దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను సమర్థిస్తూ, కవరేజ్ లో అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతను కొనసాగించాలని ఆయా ఛానెల్స్ ను కోరుతున్నాం. ప్రసార మంత్రిత్వ శాఖ సూచనల మేరకు వార్తలను కవర్ చేయాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఈ మేరకు కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం లైసెన్సులు కలిగిన టీవీ ఛానెళ్లు, అసోసియేషన్/ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్, పత్రికా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Also: భార్యను కలిసేందుకు వచ్చి, పోలీసులకు చిక్కి..
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security
"In the interest of national security, all media platforms, news… pic.twitter.com/AASdtbFgTd
— ANI (@ANI) April 26, 2025
Read Also: సొంత దేశంపై పాక్ ప్రజలు సెటైర్లు.. బాంబులేస్తే 9 లోపే వెయ్యాలట, ఎందుకంటే..