Road Accident: రంగారెడ్డి జిల్లా మొకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ICFAI కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను కోకాపేటలో ఘనంగా జరుపుకున్నారు. సంబరాలు ముగించుకుని, మరో స్నేహితుడిని డ్రాప్ చేసి కారులో తిరిగి వస్తుండగా మీర్జాగూడ వద్ద చెట్టును ఢీకొట్టింది ఎకో స్పోర్ట్ కారు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కుటుంబాల్లో తీరని శోకం
ఈ ప్రమాదంలో సూర్యతేజ (BBA-రెండో సంవత్సరం), సుమిత్ (BBA- మూడో సంవత్సరం), శ్రీనిఖిల్ (BBA-మూడో సంవత్సరం), రోహిత్ (MGIT విద్యార్థి) అనే నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, నక్షత్ర (BBA-మూడో సంవత్సరం) అనే యువతి ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు సందడిగా ఉన్న వాతావరణం, క్షణకాలంలో మృతదేహాల కుప్పగా మారడం స్థానికులను కలచివేసింది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవుతారనుకున్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆయా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: అన్న ఇంటికి నిప్పు పెట్టబోయి.. సజీవ దహనమైన తమ్ముడు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతి వేగం లేదా నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థులు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం
మిర్జాగూడలో చెట్టును ఢీకొన్న ఓ స్పోర్ట్స్ కారు
ఈ ప్రమాదంలో నలుగురు ICFAI కాలేజ్ విద్యార్థుల మృతి
మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్లుగా గుర్తింపు pic.twitter.com/9GVeWvBZWi
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026