Janasena Party: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కోట వినుత.. వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు.. చెన్నై మురికి కాలువలో శవమై కనిపించాడు. తమిళనాడు మింట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాలను, జనసేన శ్రేణులను, స్థానిక ప్రజలను తీవ్ర కలకలం రేపుతోంది.
చెన్నై మింట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయుడు శవం ఏ పరిస్థితుల్లో అక్కడకు చేరింది? మరణానికి కారణాలు ఏమిటి? హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తా జరిగినదా? అన్న కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనతో కూడిన మరొక కీలక మలుపు ఏమిటంటే.. మరణించిన రాయుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని కొద్దిరోజుల క్రితమే.. కోట వినుత సోషల్ మీడియాలో ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. కొన్ని రోజుల క్రితం వినుత తన కార్యాలయం నుంచి రాయుడిని తొలగించినట్టు సమాచారం. ఉద్యోగబాధ్యతలపైనా, నమ్మకద్రోహంపై కూడా అంతర్గత వివాదాలు చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా మొత్తం ఐదుగురిని విచారణకు పిలిపించారు. రాయుడు మరణం వెనుక కారణాలేంటి? ఎవరు జోక్యం చేసుకున్నారా? అన్న దానిపై సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, ట్రావెల్ హిస్టరీలు అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కోట వినుత కుటుంబం నుంచి అధికారికంగా స్పందన వచ్చింది. రాయుడికి మాతో ఎలాంటి సంబంధం లేదు. కొన్ని రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించాం. రాజకీయ ప్రత్యర్థులతో తమపై కుట్రచేశారని వారు ఆరోపిస్తున్నారు. రాయుడికి, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారామె.
శ్రీకాళహస్తిలో ఈ సంఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. రాజకీయ నాయకులు, జనసేన కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇది నిజంగా హత్యేనా? రాజకీయ కుట్రలో భాగమా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు రాయుడు మృతిపై.. న్యాయం జరగాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినూతపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారంటూ పార్టీ వివరణ ఇచ్చారు. రాయుడు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో తమిళనాడు పోలీసులు వినుతతోపాటు ఆమె భర్తను అరెస్టు చేశారు.
Also Read: మహారాష్ట్రలో తీవ్ర దుమారం.. మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టల బ్యాగ్..
ఈ సంఘటనతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. రాజకీయ ఉత్కంఠ మరింతగా పెరిగింది. పోలీసులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ, నిజమైన కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో జనసేన కార్యకర్త మృతి..
చెన్నైలోని మురికి కాలువలో శవమై కనిపించిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్న రాయుడు
రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తమపై రాయుడు కుట్ర చేశాడని వినూత ఆరోపణ
కొద్ది… pic.twitter.com/O1atyllyER
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2025