Italy Creates History : టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇటలీ అర్హత సాధించింది. ఇటలీ కంట్రీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఫుట్ బాల్ మాత్రమే. కానీ ఆ దేశం ఇప్పుడు క్రికెట్ లో కూడా రాణిస్తోంది. సాకర్ కాకుండా క్రికెట్ లోనూ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ గెలిచేందుకు సిద్ధమైంది ఇటలీ కంట్రీ. ఇందులో భాగంగానే టి20 ప్రపంచ కప్ ( T20 World Cup 2026 tournament ) ఆడే అవకాశాన్ని ఇటలీ (Italy Creates History) తాజాగా దక్కించుకోవడం జరిగింది. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో… విపరీతంగా పోస్టులు వస్తున్నాయి.
టి20 ప్రపంచ కప్ లోకి ఇటలీ
ఇండియా ( Team India) అలాగే శ్రీలంక ( Srilanka Team) వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council )… సరికొత్త ఈవెంట్ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. 2026 t20 పురుషుల వరల్డ్ కప్… వచ్చే సంవత్సరం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… మొత్తం 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో తాజాగా ఇటలీ కూడా అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి… ఇటలీతో పాటు నెదర్లాండ్స్.. కూడా అర్హత… సాధించడం జరిగింది.
ఫుట్ బాల్ లో ఇటలీకి ( Italy) అరుదైన రికార్డ్
ఇటలీ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటలీ అంటేనే అందరికీ ఫుడ్ బాల్ ( Foot Ball) గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఫుట్ బాల్ లో మూడుసార్లు ఛాంపియన్ కావడమే కాకుండా… రెండుసార్లు రన్నరప్ గా కూడా నిలవడం జరిగింది. కానీ క్రికెట్లో మాత్రం ఎప్పుడూ కూడా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో ఇటలీ క్వాలిఫై అయింది. దీంతో ఈ మెగా టోర్నమెంట్ లోకి 25 వ జట్టుగా ఇటలీ రంగంలోకి దిగబోతోంది. 2026 టి20 ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన 13వ జట్టుగా ఇటలీ రికార్డు సృష్టించింది. అలాగే 14వ జట్టుగా నెదర్లాండ్స్… కూడా బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. అంటే మరో ఆరు జట్లు… అర్హత సాధించాల్సి ఉంది.
జూలై 12, 2025 నాటికి ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన జట్లు
ఆఫ్ఘనిస్తాన్
ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్
కెనడా
ఇంగ్లాండ్
భారతదేశం
ఐర్లాండ్
న్యూజిలాండ్
పాకిస్తాన్
దక్షిణాఫ్రికా
శ్రీలంక
USA
వెస్టిండీస్
పైన పేర్కొన్న జట్లు మొత్తం ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి అన్న మాట.