BigTV English

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Tamilnadu Crime: తమిళనాడులో ఓ ఎస్ఐ దారుణహత్యకు గురయ్యాడు. విపక్ష అన్నాడీఎంకె ఎమ్మెల్యేకి చెందిన ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. చివరకు వెంటాడి మరీ చంపేశారు. ఘటనతో తమిళనాడు పోలీసులు ఉలిక్కపడ్డారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో తండ్రి- ఇద్దరు కొడుకుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఆ విషయం తెలియగానే ఎస్ఐ షణ్ముగవేల్ అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత జోక్యం చేసుకున్నారు. పట్టరాని కోపంతో తండ్రి, ఇద్దరు కొడుకులు వెంటాడి మరీ ఎస్ఐని చంపేశారు. ఈ ఘటన తెలియగానే పోలీసులు షాక్ అయ్యారు.

సోమవారం రాత్రి రుప్పూర్ జిల్లాలోని ఉడుమల్‌పేట సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక AIADMK ఎమ్మెల్యే మహేంద్రన్ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నారు తండ్రీ-కొడుకులు. ఎస్టేట్‌లో మద్యం మత్తులో ఉన్నాడు తండ్రి మూర్తి. ఆ సమయంలో మూర్తి-కొడుకులు తంగపాండియన్, మణికందన్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అది చివరకు గాలివానగా మారింది.


అదే సమయంలో అత్యవసర సేవలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాని ఆధారంగా స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ షణ్ముగవేల్ వెంటనే అక్కడకి బయలుదేరి వెళ్లారు. అప్పటికి ఎస్టేట్‌లో మూర్తి- ఇద్దరు కొడుకుల మధ్య కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కొడుకుల నుంచి మూర్తి విడదీశారు. గాయపడిన పెద్దాయనను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నారు.

ALSO READ: అనంతపురం నవవధువు కేసులో బిగ్ ట్విస్ట్.. ఫ్రెండ్స్ చంపేశారా?

మూర్తి పెద్ద కొడుకు తంగపాండియన్‌తో ఎస్ఐ మాట్లాడుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన చిన్న కొడుకు మణికందన్ అధికారిపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రి, పెద్ద కొడుకు దాడిలో చేసి అధికారిని వెంబడించి నరికి చంపారని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత వాహనం డ్రైవర్ తప్పించుకుని అధికారులకు సమాచారం ఇచ్చాడు.

ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడం పోలీసులు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్ఐ కుటుంబానికి కోటి ఆర్థిక సహాయం, అర్హత కలిగిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఇంకా స్పందించలేదు. శాసనసభ ఎన్నికలకు కేవలం ఎనిమిది నెలల ముందు ఈ ఘటన జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Heavy Rain in Rayachoty: రాయచోటిలో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయి నలుగురు

Over Draft Scam: బ్యాంకులో రూ.500 డిపాజిట్ చేసి రూ.5 కోట్లు కొల్లగొట్టాడు.. వార్ని ఇలా కూడా చేయొచ్చా?

Big Stories

×