Nagpur Woman: ఒక టీచర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి విద్యార్థులకు విద్యా బోధనను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులను చెడు మార్గంలో నడవకుండా వారిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు టీచర్ అనే వ్యక్తి.. కానీ, ఒక మహిళ టీచర్ వరుసగా పెళ్ళిళ్లు చేసుకుంటూ.. ఇప్పుడు 9 వ పెళ్లికి సిద్దమైంది. ఈ ఘటన మహారాష్ట్రలో నెలకొంది.
పెళ్లిళ్ల టీచరమ్మ..
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగపూర్‌కి చెందిన సమీరా ఫాతిమా నిత్య పెళ్లీ కూతురుగా రికార్డ్ సృష్టించింది. పెళ్లిళ్లు చేసుకోవడం.. బ్లాక్ మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేయడం.. భర్తలకు చెట్లపాలు చేయడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య.. ఒకరి తర్వాత ఒకరి ఇలా ఎనిమిది మందిని వివాహం చేసుకుని, లక్షల రూపాయలు వసూలు చేసిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
9 పెళ్లిళ్లు..కోట్లలో వసూళ్లు
టీచర్‌గా పనిచేసే సమీర ఫాతిమాకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని పక్క దారి పట్టడం ప్రారంభించింది. గత 15 సంవత్సరాలుగా ఈ వయ్యారి 8 మంది అబ్బాయిలను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఈమె మళ్లీ 9వ పెళ్లీ చేసుకోవడానికి సిద్ద పడుతుండగా పోలీసులకి దొరికిపోయింది. అయితే సమీర చెప్పిన వివరాల ప్రకారం మ్యాట్రీమోనీ, సోషల్ మీడియాలో బాగా డబ్బు ఉన్న అబ్బాయిలను టార్గె్ట్ చేసి వారికి రిక్వెస్ట్ పంపించేది. ముందుగా తాను వితంతువు అని అబ్బాయిలను ఎమోషనల్‌గా ట్రాప్ చేసి వారిని పెళ్ళి వరకూ తీసుకొచ్చేది.
9వ పెళ్లికి ప్రయత్నిస్తుండగా పోలీసులకి దొరికిన
అయితే ఈమె రిజర్వ్ బ్యాంక్ వాళ్లను కూడా మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయంటున్నారు. ఆమె ఈ మోసాలను ఇక మూఠాలో భాగంగా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదైన తర్వాత ఫాతిమా చాలా రోజులు పరారీలో ఉంది. ఓ సందర్భంలో గర్భవతీగా ఉన్నానని చెప్పి తప్పించుకుంది. అయితే ఆమె చివరి భర్త సమాచారం ఆధారంగా, నాగ్‌పూర్‌లోని ఒక టీ స్టాల్‌లో 9వ పెళ్లి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మహాతల్లి విడాకులు తీసుకోకుండానే వరుస పెళ్లిళ్లు..
సమీరాకు 12 సంవత్సరాల కూతురు కూడా ఉందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది.. కానీ తండ్రి ఎవరో తెలియదంటున్నారు. గిట్టిఖాదవ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ కైలాశ్ దేశ్మానే మాట్లాడుతూ కోర్టు ఆమెకు మూడు రోజులు పోలీస్ కస్టడి రిమాండ్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఎనిమిది మంది భర్తలు తమ బాధలను వివరిస్తూ అఫిడవిట్లు సమర్పించారని వారు పేర్కొన్నారు.
Also Read: వెన్నులో వణుకు, దేశంలో సంచలనం పుట్టిస్తున్న ధర్మస్థల
అయితే ఈమె వెనుక ఇంకేవరైన ఉన్నారా? లేదా డబ్బు ఆశతో ఈమె ఒక్కతే చేసిందా.. అసలు మొత్తం ఎంత డబ్బు వసూలు చేసిందీ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఎనిమిది మంది అబ్బాయిలను పెళ్ళి చేసుకున్నప్పటికి ఎవరితో విడాకులు తీసుకోకుండానే వరుసగా పెళ్లిళ్లు చేసుకుందని పోలీసుల విచారణలో తెలిపారు.