BigTV English

Pakistan Name Banned: పాకిస్తాన్ ప్లేయర్లకు ఎదురు దెబ్బ.. PCB షాకింగ్ నిర్ణయం

Pakistan Name Banned: పాకిస్తాన్ ప్లేయర్లకు ఎదురు దెబ్బ.. PCB షాకింగ్ నిర్ణయం

Pakistan Name Banned: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ {WCL} 2025 సెమి ఫైనల్ లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో తలపడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్కంఠగా మారిన ఈ టోర్నీలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టోర్నీలోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తో పాటు సెమీఫైనల్ మ్యాచ్ లను భారత్ ఛాంపియన్స్ జట్టు రద్దు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో తలపడాల్సి వస్తే.. అది ఫైనల్ మ్యాచ్ అయినా సరే అదే నిర్ణయాన్ని తీసుకుంటామని భారత రిటైర్డ్ ప్లేయర్లు స్టేట్మెంట్ ఇచ్చారు.


Also Read: Ind vs Eng 5th Test: లండన్ టెస్ట్ లో కుప్పకూలిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్ స్కోర్ ఎంత అంటే!

అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుతో ఇండియా సెమిస్ లో ఆడాల్సి ఉంది. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ తో ఆడేది లేదని ఇండియా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ {PCB} సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ప్రైవేట్ మ్యాచ్ లకు పాకిస్తాన్ పేరు వాడకూడదని నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రైవేట్ లీగ్ లలో ఆడే పాకిస్తాన్ జట్లకు తమ దేశం పేరు పెట్టకుండా ఉండే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


టెలికాం ఏసియా స్పోర్ట్స్ అనే వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్లను మినహాయించి.. పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడబోయే ప్రతి ప్రైవేట్ లీగ్ కి ఈ నిబంధన వర్తిస్తుందని పిసిబి వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశ మాజీ ఆటగాళ్లు షాక్ కి గురయ్యారు. దేశం ఐడెంటిటీ లేకుండా మ్యాచ్ లు ఆడడం ఏంటి..? అంటూ మాజీ ఆటగాళ్లు ఫైర్ అవుతున్నారు. అయితే బ్రిటన్ లో జరుగుతున్న డబ్ల్యూసిఎల్ లో వివాదం చెలరేగడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

బోర్డు డైరెక్టర్లతో జరిగిన చర్చల్లో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తో ఆడేందుకు ఇతర దేశ ఆటగాళ్లు నిరాకరించడం అంటే తమ దేశానికి చెడ్డ పేరు వస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ప్రైవేట్ లీగ్ లలో ఆడే ఏ సంస్థకైనా దేశం పేరు పెట్టుకునే అనుమతి ఇవ్వబోమని పిసిబి నిర్ణయించింది. అయితే ఈ ఆదివారం సౌత్ ఆఫ్రికా తో జరిగే ఫైనల్ లో మాత్రం పాకిస్తాన్ లెజెండ్స్ జట్టు యధావిధిగా పోటీ పడనుంది. కెన్యా, అమెరికా, జింబాబ్వే లాంటి దేశాల్లో జరుగుతున్న క్రికెట్ పోటీలలో అనేక సంస్థలు పాకిస్తాన్ పేరు వాడినట్లు రిపోర్ట్ ఉంది.

ఒకవేళ ప్రైవేట్ సంస్థలు దేశం పేరు వాడితే దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పిసిబి వార్నింగ్ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ప్రధాన స్పాన్సర్స్ ఈజీమైట్రిప్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. క్రికెట్ – ఉగ్రవాదం కలసి సాగలేవు అనే నినాదంతో వారు మ్యాచ్ ని బహిష్కరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలను సాధారణీకరించడానికి ప్రయత్నించే ఏ కార్యక్రమానికి తాము మద్దతు ఇవ్వలేమని ఈజీమైట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: CSK: CSKలోకి ఇద్దరు టీమిండియా వికెట్ కీపర్లు.. ఇక 2026లో రచ్చ రచ్చే..!

దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామం ఆసియా కప్ 2025 పై పడే అవకాశాలు లేవంటున్నారు క్రీడానిపుణులు. ఆసియా కప్ లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ సెప్టెంబర్ 14, 2025న యూఏఈ లో జరగనున్న ఈ మ్యాచ్ రద్దు కాదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని.. అనేక దేశాల టోర్నమెంట్ లో భాగంగా జరిగే మ్యాచ్ మాత్రమేనని ఎసిసి సభ్యులు తెలియజేశారు.

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×