Dharmastala Case Updates: ధర్మస్థలల మృతదేహాల మిస్టరీ తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగింది. చెప్పలేనన్ని ఘోరాలు నేత్రావతి నది ఒడ్డున జరిగాయని విజిల్ బ్లోయర్ చెప్పడంతో అసలు అక్కడ ఏం జరిగిందన్న సందేహాలు మొదలయ్యాయి. వందల మంది మిస్సయ్యారని.. లెక్క లేనన్ని శవాలు పూడ్చేశానని ఒక వ్యక్తి చెప్పడం సంచలనంగా మారింది.
వరుసగా బయటపడుతున్న మృతదేహాలు
పారిశుద్ధ్య కార్మికుడు అందించిన సాక్ష్యాలు, అనుమానస్పద మరణాలపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అతన్ని వెంట తీసుకొని వెళ్లి కొన్ని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి మొదలెట్టారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం 13 చోట్లను గుర్తించగా.. తవ్వకలు జరుపుతున్నారు. 6వ పాయింట్ వద్ద అస్థిపంజరం లభ్యం కావడంతోపాటు, కొన్ని మానవ అవశేషాలు లభ్యం అయ్యాయి. ఆ ఎముకల్ని FSLకు పంపారు అధికారులు.
రీసెంట్‌గా 6వ పాయింట్‌లో మూడు మృతదేహాలు
ఇప్పుడు 6వ స్పాట్‌లో మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. డెబిట్ కార్డు, పర్స, ఎర్ర జాకెట్టు బయటపడటంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరుకు చెందిన సురేశ్, అతని తల్లి లక్ష్మి డెబిట్ కార్డుగా గుర్తించారు. మహిళ లోదుస్తులు కూడా దొరకడంతో సిట్ మరింత దూకుడు పెంచింది.
ఇన్ని ఘోరాలు జరిగినా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది?
పిల్లల్ని, మహిళల్ని, బడికెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయంటున్నాడు. ఇప్పడు అతను ఇచ్చిన వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తుంది. నిజంగానే ధర్మస్థలిలో అన్ని ఘోరాలు జరిగాయా? ఇన్నేళ్లు ఎందుకు ఆ నిజాలు బయటపడలేదు? ఒక వేళ ఇన్ని ఘోరాలు జరుగుతున్న అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? దీని వెనకున్న మిస్టరీ ఏంటి? ప్రతి ప్రశ్న మైండ్‌లో దిగుతుంటే.. నిద్ర పట్టటంలేదే! అసలేం జరిగింది?
తానే చంపానంటున్న పారిశుద్ధ్య కార్మికుడు!
ఒకే ఒక్కడు పాపభీతి వెంటాడుతుందని.. ప్రాణ భయంతో చేశానంటూ నోరు విప్పాడు. లెక్క లేనన్ని శవాలను పూడ్చానంటున్నాడు ఓ పారిశుధ్య కార్మికుడు. తన చేతులతోనే వందల శవాలను పూడ్చి పెట్టానన్నాడు. 1995 నుంచి 2014 వరకూ ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుధ్య కార్మికుడి వాంగ్మూలం ఇది. ఇప్పుడు అది దేశాన్ని షేక్‌చేస్తోంది. వెన్నులో గగుర్పుడిచే వ్యాఖ్యలను ఎవరు నమ్మరని ఆధారాలుగా… తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలను కూడా తీసి చూపించాడు. తనకు తెలిసిందల్లా సీల్డ్ కవర్లో పెట్టి… అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదికి ఇచ్చాడు.
Also Read: గొర్రెల స్కాం కేసులో సంచలన విషయాలు.. ఏకంగా రూ.1000 కోట్ల స్కాం..!
2003లో ధర్మస్థలలో అన్యన్యభట్ అదృశ్యమైంది. శ్రీమంజునాథ టెంపుల్‌కు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. జూలై 15న అనన్యభట్ తల్లి సుజాత తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించింది. అంతేకాదు.. సత్యమేవ జయతే అంటూ సుజాత భట్, అడ్వకేట్ మంజునాథ్ ప్రకటన రిలీజ్ చేశారు. ఇక వేదవల్లి, పద్మలత, మరో 17ఏళ్ల అమ్మాయిదీ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. ఇక అనధికారంగా అదృశ్యమైన మైనర్ల సంఖ్యకు లెక్కేలేదు. మొత్తానికి లోదుస్తులు లేని యువతులు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలనే ఎక్కువగా పాతిపెట్టినట్లు ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు.