Surat Crime News: యువతికి 23 ఏళ్లు.. అబ్బాయి వయసు 11 ఏళ్లు.. వీరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఫలితంగా ఇద్దరూ రాష్ట్రాలు దాటి వెళ్లిపోయారు. నాలుగు రోజులపాటు ఎవరికీ కనిపించలేదు. చివరకు పోలీసులకు చిక్కారు. ఇంతకీ అసలు కథేంటి? దూరంగా పోయేంత అవసరం ఎందుకొచ్చింది? అన్నదే అసలు ప్రశ్న. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది.
స్టోరీలోకి వెళ్తే..
గుజరాత్‌లోని సూరత్ సిటీలో 23 ఏళ్ల యువతి టీచర్‌గా పని చేస్తోంది. సూరత్‌లోని పూణే ప్రాంతంలో కిరాణా వ్యాపారి కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు టీచర్ వద్ద ట్యూషన్ వస్తున్నాడు. యువతి-విద్యార్థి కుటుంబాలు పక్క పక్కనే రెండు లేదా మూడేళ్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో టీచర్ వద్దకు ట్యూషన్‌కు వచ్చేవాడు. ఏడాదిగా ఏకైక విద్యార్థిగా ట్యూషన్‌లో మిగిలాడు. ఈ క్రమంలో టీచర్-విద్యార్థి సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇదే సమయంలో టీచర్‌కు ఆమె కుటుంబం నుండి కొత్త సమస్య వచ్చి పడింది. వివాహం చేసుకోవాలని యువతిని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. సరిగా చదవడం లేదంటూ కుర్రాడికి ఇంట్లో ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు పేరెంట్స్. ఈ క్రమంలో యువతి పారిపోవాలని నిర్ణయించుకుంది. ఒంటరిగా వెళ్తే బాగోదని భావించి ట్యూషన్ స్టూడెంట్‌ను కన్వీన్స్ చేసింది. ఆపై ఇద్దరు కలిసి ఇంటి నుంచి పరారయ్యారు.
ఇరు కుటుంబాల్లో టెన్షన్
ఇంట్లో ఉన్నవాళ్లు కనిపించకపోవడంతో ఇరుకుటుంబాల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. తొలుత బయటకు వెళ్లారని అనుకున్నారు. 24 గంటలు గడిచినా రాలేదు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ప్రస్తావించారు. దీంతో సూరత్ పోలీసులు రంగంలోకి దిగేశారు. వీరి కోసం గాలింపు చేపట్టారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పోలీసులను అలర్ట్ చేశారు.
ALSO READ: యువతిని చంపి రెండురోజులుగా ఇంట్లోనే శవం, దుర్వాసన రాకుండా ఆపై అగర్‌బత్తీలు
బాలుడితో పారిపోయిన కొద్ది గంటలకే ఆ యువతి తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసింది. నాలుగురోజుల పాటు వీరిద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. నాలుగో రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజస్థాన్ సరిహద్దులోని షామ్లాజీ సమీపంలో వెళ్తున్న బస్సును ఆపి యువతి-బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలుడ్ని వాళ్ల పేరెంట్స్ అప్పగించారు. యువతిని విచారించారు.
పోలీసుల వెర్షన్
ఈ కేసుపై సూరత్ డీసీపీ భగీరథ్ మాట్లాడారు. రాయ్‌గఢ్ వీరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇరు కుటుంబాల నుండి తిట్లు ఎదుర్కొంటున్నారని విసుగు చెందిన చివరకు పారిపోయారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ నాలుగు ఎక్కడ, ఏం చేశారు? అనేదానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎలాంటిదన్న కోణంలో విచారణ చేస్తున్నారు.