Yuzi Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో…. అరుదైన రికార్డులను నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో… 50 మ్యాచ్ల వరకు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ కూడా అయింది. అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. మరో నాలుగు రోజుల్లో మిగతా జట్లు కూడా ఎలిమినేట్ అవుతాయి. అటు ప్లే ఆఫ్ వెళ్లే జట్లు కూడా దాదాపు ఖరారు అయినట్లే. అయితే ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్… అరుదైన రికార్డు సాధించాడు. తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రెండుసార్లు… హ్యాట్రిక్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు యుజ్వేంద్ర చాహల్ (Yuzi Chahal).
Also Read: Kohli – Preity Zinta: ప్రీతి జింటాతో కోహ్లీ ఎంజాయ్.. అనుష్క 99 మిస్డ్ కాల్స్ ?
ఐపీఎల్ లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన చాహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రెండోసారి సాధించాడు హ్యాట్రిక్ సాధించాడు యుజ్వేంద్ర చాహల్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. 19 వ ఓవర్ లో వరుసగా మూడు వికెట్లు తీశాడు యుజ్వేంద్ర చాహల్. కంభోజ్, హుడా అలాగే నూర్ అహ్మద్ వికెట్లను వరుసగా తీశాడు. ఇదే ఓవర్ లో మహేంద్రసింగ్ ధోని వికెట్ కూడా తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
చాహల్ కు ఐపిఎల్ లో ఇదే మొదటి హ్యాట్రిక్ కాదు. 2022 ఐపిఎల్ టోర్నమెంట్ సమయంలో కూడా ఈ ఘనత సాధించాడు. అప్పుడు చాహల్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. 2022 ఐపిఎల్ టోర్నమెంట్లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో వరుసగా మూడు వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు చాహల్. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
ఇద్దరూ లేడీ ల సమక్షంలోనే చాహల్ రికార్డు
2022 ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో… చాహల్ హ్యాట్రిక్ సాధించి రికార్డు లోకి ఎక్కాడు. అప్పుడు తన భార్య ధనశ్రీ వర్మ ( Dhana Sri Verma) అతనితోనే ఉంది. హ్యాట్రిక్ సాధించిన సమయంలో గ్రౌండ్ కు కూడా వచ్చి ఎంజాయ్ చేసింది. చాహల్ కు మంచి… ఎంకరేజ్మెంట్ కూడా.. ఆమె ద్వారా అందింది. అయితే బుధవారం జరిగిన మ్యాచ్ లో ధనశ్రీ వర్మ స్థానంలో RJ మహ్వాష్ ( RJ Mahvash)… వచ్చేసింది. గతంలో ధనశ్రీ వర్మ భార్యగా… స్టేడియానికి వస్తే RJ మహ్వాష్ ( RJ Mahvash) మాత్రం ప్రియురాలి స్థానంలో స్టేడియానికి వచ్చింది. ఈ సందర్భంగా చాహాలు సాధించిన రికార్డు నేపథ్యంలో ఎంజాయ్ చేసింది. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Sam Curran: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన సామ్ కర్రన్
First bowler to take 2 Hattricks in front of two different girlfriends.
Yuzi Chahal 🗿 pic.twitter.com/l5kaA8tYwV— Dinda Academy (@academy_dinda) May 1, 2025