BigTV English

Teenager shoots Old Man | బస్సులో కాలు అడ్డుపెట్టిన వృద్ధుడు.. గన్‌తో కాల్చిన టీనేజర్!

Teenager shoots Old Man | బస్సులో ప్రయాణం కోసం వెళ్లిన ఒక 13 ఏళ్ల బాలుడు.. తన దారి అడ్డుగా ఒక వృద్ధుడు కాలు పెట్టడని గన్‌తో కాల్చాడు. ఈ ఘటన అమెరికాలోని డెన్‌వర్‌ నగరంలో జరిగింది.

Teenager shoots Old Man | బస్సులో కాలు అడ్డుపెట్టిన వృద్ధుడు.. గన్‌తో కాల్చిన టీనేజర్!

Teenager shoots Old Man | బస్సులో ప్రయాణం కోసం వెళ్లిన ఒక 13 ఏళ్ల బాలుడు.. తన దారి అడ్డుగా ఒక వృద్ధుడు కాలు పెట్టడని గన్‌తో కాల్చాడు. ఈ ఘటన అమెరికాలోని డెన్‌వర్‌ నగరంలో జరిగింది.


అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన రిచర్డ్ శాంచెజ్(60) మూడు రోజులుగా కనబడడంలేదని పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే పోలీసులు వారికి కొన్ని మ‌ృతదేహాలు చూపించారు. అందులో రిచర్డ్ శవం కనిపించింది.

పోలీసుల కథనం ప్రకారం.. డెన్వర్ నగరంలో ఓ 13 ఏళ్ల బాలుడు ప్రయాణం కోసం సిటీ బస్సు ఎక్కాడు. కానీ బస్సులో ఒక 60 ఏళ్ల ముసలి వ్యక్తి అయిన రిచర్డ్ కాలు దారికి అడ్డంగా ఉండడంతో ఆ బాలుడు దురుసుగా మాట్లాడాడు. దీంతో వృద్ధుడైన రిచర్డ్ కూడా అతడి ప్రవర్తన చూసి కోపంగా కాలు తీయనని చెప్పాడు. అలా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఆ బాలుడు తన వద్ద ఉన్న తుపాకీ తీసి రిచర్డ్‌ను కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు.


ఈ ఘటన రిచర్డ్ ఇంటికి కొంత దూరంలో జరిగింది. బస్సు డ్రైవర్.. రిచర్డ్‌ని తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. కానీ అప్పటికే రిచర్డ్ చనిపోయాడాని డాక్టర్ల చెప్పారు. అయితే రిచర్డ్ జేబులో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రిచర్డ్ మృతదేహాన్ని అనాథ శవంగా మార్చురీలో పెట్టారు. పోలీసులు రిచర్డ్‌ని తుపాకీ కాల్చిన బాలుడిని రెండు రోజుల తరువాత పట్టుకున్నారు.

ఘటన జరిగిన మూడు రోజుల తరువాత రిచర్డ్ కనబడడం లేదని అతని కుటుంబం పోలీసుల వద్దకు వెళ్లగా.. వారికి రిచర్డ్ శవాన్ని పోలీసులు చూపించారు. అమెరికాలో గన్ కల్చర్ వల్ల ప్రతి పౌరుడి వద్ద తుపాకీ ఉంటుంది. పేరుకి ఇది వారి ఆత్మరక్షణ కోసం అని చట్టం చెప్పినా.. క్షణికావేశం వల్ల ఆ తుపాకీ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.

Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×