Gandikota Murder: గండికోట బాలిక హత్య కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. పరువు హత్యగా పోలీసులు తేల్చి చెప్పారు. బాలిక సోదరులే చంపినట్టు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు పోతుందనే కోపంతోనే సోదరులు హత్యకు పాల్పడినట్టు పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
బాలిక ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయిని దారుణంగా హింసించి చంపినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే కీలక ఆధారాలు లభించాయని డీఐజీ చెప్పారు. అత్యాచారం జరగలేదని కూడా తేల్చారు. ఆ అమ్మాయి మృతి కేసులో.. లోకేష్ ప్రమేయం లేదని కూడా పోలీసులు ముందే చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుతం లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అంతేకాదు.. బాలికపై లైంగిక దాడి కూడా జరగలేదని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులే అమ్మాయిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
గండికోటలో బాలిక మృతి చెందిన ప్రదేశాన్ని పోలీసులు మరోసారి పరిశీలించారు. మళ్లీ మొదటి నుంచి అనుమానితులందరినీ ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఆరా తీస్తున్నారు. మరోసారి గండికోట ప్రాంతంలో సీసీ ఫుటేజ్‌ను టెక్నికల్ టీమ్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే.. బాలిక కుటుంబ సభ్యులను పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. అనుమానం ఉన్న మరికొందరిని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య హత్య జరిగిందంటున్నారు పోలీసులు. గండికోట లోపలికి వెళ్లడానికి ఒక్కటే మార్గం ఉంది. హంతకులు ఆ మార్గం గుండానే లోపలికి వెళ్లే అవకాశాలున్నాయి. హత్య జరిగిన రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 60 మంది టూరిస్టులు మాత్రమే గండికోటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ALSO READ: NPCIL Jobs: ఐటీఐ, డిగ్రీ అర్హతతో 337 ఉద్యోగాలు.. అప్లై చేస్తే జాబ్.. చివరి తేది ఇదే..
ALSO READ: Plane Crash: స్కూల్ భవనంపై కూలిన విమానం.. పలువురు మృతి