Kanrataka Crime News: చిన్న పిల్లలు తప్పులు చేస్తే మందలిస్తాము.. కంటిన్యూ చేస్తే రెండు తగిలిస్తాము. విద్యాబుద్దులు చెప్పాల్సిన కన్న తల్లి హత్యకు పురిగొల్పింది. కూతుకు, మైనర్ కొడుకు సాయంతో ఓ మహిళను హత్య చేసింది. మరో విషయం ఏంటంటే కేవలం 15 వేల రూపాయలకు ఈ హత్య జరిగింది. దృశ్య సినిమా సీన్ తలపించేలా జరిగిన ఈ కేసులో అనేక ట్విస్టులు మొదలయ్యాయి. కర్ణాటకలోని బెళ్గావి సిటీ ఈ క్రైమ థ్రిల్లర్‌కు వేదికైంది.
దృశ్యం సినిమా సీన్ రిపీట్
కర్ణాటకలోని బెళ్గావి సిటీ ఈ క్రైమ థ్రిల్లర్‌కు వేదికైంది. సిటీలోని లక్ష్మీనగరలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది అంజనా దడ్డీకర్. ఆమె వయస్సు 49 ఏళ్లు. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. అంజనా దడ్డీకర్‌కు జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. స్నేహం బాగానే సాగింది. ఈ క్రమంలో అంజనాకు కొంత డబ్బు అవసరం ఏర్పడింది.
బయటవారిని అడిగే బదులు జ్యోతిని అడిగింది. అదిగో, ఇదిగో అంటూ మభ్యం పెట్టడ మొదలుపెట్టింది అంజనా. ఈ విషయంలో ఇద్దరు మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. అంజనా ఇంట్లోకి చొరబడి డబ్బు, నగలు దొంగిలిస్తే ఆమెకి తీసుకున్న డబ్బులు సరిపోతుందని భావించారు. ఈనెల 21న సరిగ్గా రాత్రి 11 నుంచి 12 గంటల సమయంలో అంజనా ఇంటికి వెళ్లారు.
15 వేల కోసం హత్య
జ్యోతి తనతోపాటు కూతురు సుహాని, మైనర్ కొడుకుని తీసుకెళ్లింది. ఏం జరిగిందో తెలీదుగానీ అంజనా గొంతు పిసికి చంపేసింది జ్యోతి ఫ్యామిలీ. తొలుత అంజనా తలపై బాదారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే గొంతు పిసికి చంపేశారు. అంజనా మెడలో మంగళసూత్రం, ఇంట్లోని బంగారు నగలతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
ALSO READ: కెనడాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి.. హత్యా.. ఆత్మహత్యా?
మరుసటి రోజు తెల్లవారికే సరికి అంజనా చనిపోయింది. ఆమె కూతురు అక్షత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బెళ్గావి క్యాంప్ ఏరియా పోలీసులు అంచనా డెడ్‌బాడీపై వేలిముద్రలు సేకరించారు. ఆ తర్వాత జ్యోతి కుటుంబ సభ్యులను విచారణకు పిలిచారు. అంజనా మృతి రోజు తాము ఊరులో లేమని, బయట వున్నామని చెప్పారు. అందుకు సంబంధించి బిల్లులు చూపించారు.
చివరకు ఫోన్ కాల్స్, సీసీ కెమెరా దృశ్యాలు, వేలి ముద్రలతో హత్య వ్యవహారం బయటపడింది. పోలీసుల విచారణలో జ్యోతి జరిగిన విషయాన్ని బయటపెట్టింది. తమ వద్ద రూ.15 వేలు అప్పు తీసుకుందని, డబ్బులు ఇవ్వాలని అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేసిందని తెలిపింది. చివరకు హత్యకు స్కెచ్ వేసినట్టు వెల్లడించారు. చివరకు జ్యోతి, ఆమె కూతురు సుహానీ, మైనర్ కొడుకుని అరెస్టు చేశారు పోలీసులు.