BigTV English
Advertisement

Bad cholesterl : చెడు కొలెస్ట్రాల్ చింత ఎందుకు.. వీటిని తింటే అంతా సెట్..

Bad cholesterl : చెడు కొలెస్ట్రాల్ చింత ఎందుకు.. వీటిని తింటే అంతా సెట్..

Bad cholesterl: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ గురించి చింతించకుండా, మీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా దానిని సమతుల్యం చేసుకోవచ్చు. అయితే కొన్ని ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా విటమిన్ B ఉండే ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాలును కరిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


పుట్టగొడుగులు:

పుట్టగొడుగుల్లో విటమిన్ B2. B3, B5, బయోటిన్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పదార్థాల సమతుల్యతను కాపాడుతూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కడుపు సమస్యలు లేదా అల్సర్ సమస్యలు ఉన్నవారిలో పుట్టగొడుగులను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే మలబద్ధకం లక్షణాలను తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


నానబెట్టిన బాదం:

బాదం రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రకారం, ప్రతిరోజూ బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ 5 శాతం తగ్గుతుందని అంటున్నారు. బాదం పాలు తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు కూడా తగ్గిపోతాయి. ప్రతిరోజూ రాత్రి బాదంపప్పుని నానబెట్టి ఉదయాన్నే తింటే కొలెస్ట్రాల్ కచ్చితంగా తగ్గుతుందంటున్నారు.

పనీర్:

పాలతో తయారు చేసిన పనీర్ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఓట్స్:

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను కరిగించి బయటికి పంపుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పీచుపదార్థాలు తీసుకుంటే గుండెకి మంచిది. ఓట్స్‌ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్, పాలతో కలిపి తీసుకోవచ్చు.

పాలకూర:

పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ B1, B2 తో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు నియంత్రించబడుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

పెరుగు:

పెరుగులో విటమిన్ B2, B12 మాత్రమే కాకుండా కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో యోగర్ట్ చేర్చడం మంచి అలవాటు.

బ్రౌన్ రైస్:

వైట్‌రైస్‌కు బదులుగా బ్రౌన్‌రైస్ తీసుకుంటే విటమిన్ B1, B3, B5, B6 వంటి పోషకాలతో పాటు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది బరువు నియంత్రణతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.

నిమ్మరసం:

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాటెచిన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఉడికించిన మినుములు, బఠాణీ వంటి పప్పుల్లో విటమిన్ B9 అధికంగా ఉంటుంది. ఈ పదార్థం రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాడు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు.

కివీ:

కివీ చిన్న పండు అయినప్పటికీ ఇందులో విటమిన్ B12, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కలిసి గుండెకు శక్తిని అందిస్తూ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో తోడ్పడతాయి. ప్రతి రోజు కివీ పండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: వామ్మో.. ఎలుకల వైరస్, ఇప్పటికే ఇద్దరు మృతి.. లక్షణాలు ఇవే

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గుండెను రక్షించుకునేందుకు మనం తినే ఆహారంపై దృష్టిపెట్టడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా అలానే పెరుగుతాయి. అందుకే, కొలెస్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. ఉన్న అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×