BigTV English

Gujarat Illegal Coal Mine: గుజరాత్ బొగ్గు గనిలో ముగ్గురు మృతి.. ఊపిరాడక చనిపోయిన కార్మికులు..!

Gujarat Illegal Coal Mine: గుజరాత్ బొగ్గు గనిలో ముగ్గురు మృతి.. ఊపిరాడక చనిపోయిన కార్మికులు..!

3 Killed in Gujarat Illegal Coal Mine: గుజరాత్ లోని ఓ బొగ్గు గనిలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. గనిలోపల కార్మికులకు సరిపడ ఆక్సిజన్ లభించకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. కానీ వారిని బయటికి ఆదివారం తీయగలిగారు. అయితే ఆ గనిలో పనిచేసే కార్మికులకు భద్రత విషయంలో గని యజమానులు నిర్లక్ష్యం వహించారని.. అందువల్లే కార్మికులు చనిపోయారని పోలీసులు తెలిపారు.


గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లా, థంగడక తాలూకా భేట్ గ్రామంలో ఉన్న బొగ్గు గనికి అనుమతి లేకుండా చట్టవ్యతిరేకంగా బొగ్గు తవ్వకాలు చేస్తున్నారని.. బొగ్గు గని సంబంధించిన నలుగురు యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బొగ్గు గని యజమానులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గని యజమానులు జషాభాయ్ కేరాలియా, జనక్ అనియారియా, ఖీమ్ జీ భాయ్ సరాదియా, కల్పేష్ పర్మార్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

బొగ్గు గనిలో పనిచేసే లక్ష్మణ్ దాభి(35), ఖొడాభాయ్ మక్వానా(32) , విక్రమ్ కెరాలియా (35) శనివారం గనిలోపల పనిచేసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. గనిలోపల ప్రమాదకర గ్యాస్‌ని పీల్చుకున్నారని.. వారికి గనిలో ఆ ప్రదేశంలో సరిపడ ప్రాణవాయువు లభించపోవడంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గనిలో పనిచేసే కార్మికుల భద్రత కోసం ఎటువంటి హెల్మెట్లు, మాస్క్ లు ఇచ్చేవారు కాదని తెలిసింది.


Also Read: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య

చనిపోయిన నలుగురు కార్మికుల మృతదేహాలు పోస్ట్-మార్టం కోసం పంపించారు. ఫిబ్రవరి నెలలో కూడా ముగ్గురు గని కార్మికులు జెలటిన్ బాంబు పేలి ఆ గ్యాస్ పీల్చుకోవడంతో చనిపోయారు.

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×