Medak road accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని నర్సాపూర్ మండలం చింతకుంట సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అనంతరం వెంటనే ఓబైక్ పై నుంచి లారీ వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.
మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు పేర్కొన్నారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి ఉందని తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అని..? పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Crime News: తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కసాయి కొడుకు
Also Read: Iran Explosion: భారీ పేలుడు.. 500 మందికి తీవ్రగాయాలు..