BigTV English

Bigg Boss Nikhil : వేరే లెవెల్ ఆఫీస్.. వారానికో ఎపిసోడ్.. నిఖిల్ ఫ్యాన్స్ కి పండగే..

Bigg Boss Nikhil : వేరే లెవెల్ ఆఫీస్.. వారానికో ఎపిసోడ్.. నిఖిల్ ఫ్యాన్స్ కి పండగే..

Bigg Boss Nikhil : బుల్లితెర నటుడు బిగ్ బాస్ స్టార్ నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోరింటాకు సీరియల్ తో మన ముందుకు వచ్చి బిగ్ బాస్ విన్నర్ గా అందరి హృదయాలలో నిలిచిపోయాడు. బిగ్బాస్ తరువాత నిఖిల్ ఎప్పుడెప్పుడు కొత్త ప్రాజెక్టులో కనిపిస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. వాళ్లందరికీ నిఖిల్ అయితే గుడ్ న్యూస్ చెప్పేశాడు.. నిఖిల్ తాజాగా ఇన్స్టాల్ లో పెట్టిన పోస్ట్ తో మరో కొత్త ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నారని తెలిసింది. ఈరోజు దానికి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. అసలు నిఖిల్ ఏ విధంగా మన ముందుకు రానున్నారు? ఎప్పుడు ఎక్కడ అనేది తెలుసుకుందాం..


ఆ ఓటీటీలో రిలీజ్..

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఇప్పటివరకు సీరియల్స్ లో నటించి మెప్పించారు. ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తాజాగా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ లో నిఖిల్ నటించబోతున్నాడు. బిగ్బాస్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ ఇప్పుడు కొత్తగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ప్రోమోలో వేరే లెవెల్ ఆఫీస్ టు టైటిల్ తో నిఖిల్ క్లాస్సీ లుక్ లో అదిరిపోయాడు.. ఆహా రిలీజ్ చేసిన ప్రోమోలో నిఖిల్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ సద్దాం, మహేష్ మిర్చి, కిరణ్ వంటి నటులతో మాట్లాడుతూ ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. మే ఒకటో తారీకు నుంచి సాయంత్రం ఏడు గంటలకు ఆహాలో ఈ వెబ్ సిరీస్ రానుంది. మీకు మీ పనికంటే వేరే వాళ్ళ విషయంలో దూరడం చాలా ఇష్టం అనుకుంటా, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది.. అది మారుద్దాం అని నిఖిల్ చెప్పే డైలాగ్ తో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపు ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. ప్రోమోతో ఆకట్టుకున్న నిఖిల్ రేపు రిలీజ్ అవుతున్న ట్రైలర్ తో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అంతేకాకుండా నిఖిల్ ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ నుంచి ప్రతి వారం కూడా ఒక ఎపిసోడ్ విడుదలవుతుందని అఫీషియల్ గా ప్రోమోలో అనౌన్స్ చేశారు.. ఈ వీడియో చూసిన ప్యాన్స్ నిఖిల్ వారానికి ఒకసారి ఎపిసోడ్ వస్తుందని పండగ చేసుకుంటున్నారు.


సీక్వెల్ తో రానున్న నిఖిల్ ..

తాజాగా నిఖిల్ చిన్ని సీరియల్ లో నటించారు. ఓ గెస్ట్ రోల్ లో విజయ్ పాత్రలో ఈ సీరియల్ లో కనిపించారు. కొన్ని రోజులకే సీరియల్ నుంచి తప్పుకున్నారు. కారణం ఏదైనా మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ నిఖిల్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. మళ్లీ మరో సీరియల్ తో మన ముందుకు వస్తారని అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ తో మన ముందుకు వస్తున్నారు. గతంలో ఆహాలో వచ్చిన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ సక్సెస్ ని అందుకుంది. 2024 లో వచ్చిన వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కామెడీ డ్రామాగా మన ముందుకు వచ్చింది. ఇందులో అఖిల్ సార్ధక్, శుభశ్రీ, ఆర్జే కాజల్, మిర్చికిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, మహేష్ కీలకపాత్రలలో నటించారు. ఈ వెబ్ సిరీస్ కి సత్తిబాబు దర్శకత్వం వహించగా, వరుణ్ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ హైదరాబాదులోని కార్పొరేట్ ఆఫీస్ లో జరిగే యూత్ ప్రాబ్లమ్స్ ని, కామెడీ రూపంలో ఈ సిరీస్ లో తెలిపారు. ఇప్పుడు దాని  సీక్వెల్ గా వస్తున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×