Lorry Accident in Tirumala: తిరుపతిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. టమాటాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
టమాటాల లోడు ఉన్న కంటైనర్ కారుపై పడటంతో కారులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..
పుంగనూరులో ఆశా కార్యకర్త ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పుంగనూరులోని చౌడేపల్లి మండలం పుదిపట్లకు చెందిన ఆశా కార్యకర్త హేమ (30) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో హేమ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. హేమ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను హత్య చేసి ఉరివేశారా ? లేక ఆత్మహత్యేనా ? అన్న కోణంలో విచారిస్తున్నారు.