BigTV English

TPCC: కొత్త చీఫ్ వస్తే.. కమిటీలు కామనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

TPCC: కొత్త చీఫ్ వస్తే.. కమిటీలు కామనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

– మా పాలన నచ్చే ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు
– హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తాం
– ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది మేమే
– ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ లేదు
– టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
– కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ప్రత్యేక భేటీ


Congress: ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒకవేళ ఎన్నికలు జరిగినా అవి తమ ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు మహేష్ కుమార్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఖర్గే ఆశీర్వాదం కోసం కలిశానని అన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మహా నేత అని, అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారని చెప్పారు. అధిష్టానం సూచనలతో అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తానని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తానని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Also Read: Arekapudi Gandhi Vs Kaushik Reddy: వీధికెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్,కేటీఆర్ మౌనమేలా?


పీసీసీ అధ్యక్షుడు మారిన తర్వాత ప్రతీసారి కొత్త కమిటీలు ఏర్పడుతాయని చెప్పారు. కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తానన్న పీసీసీ చీఫ్, ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా పార్టీ మార్పులపై నడుచుకుంటామని, పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నామని వివరించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి సున్నా స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేకనే నేతలు తమ వైపు చూస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్న మహేష్ కుమార్, ఒకవేళ జరిగినా గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.

Related News

Birth Certificate: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

Big Stories

×