Paragliding Accident: ప్యారా గ్లైడింగ్ చేస్తూ కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో గాల్లోకి లేవలేక కూలిపోయింది గ్లైడర్. ప్రమాదంలో టూరిస్ట్ సతీష్ మృతి చెందగా, పైలట్ సూరజ్‌కి గాయాలు అయ్యాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
సతీష్ అనే యువకుడు ప్యారా గ్లైడింగ్ కోసం ధర్మశాల వద్ద ఉన్న.. ప్రసిద్ధ టేకాఫ్ పాయింట్ ఇంద్రనాగ్‌కి వెళ్లాడు. అనుభవజ్ఞులైన సూరజ్ అనే పైలట్‌తో కలిసి డబుల్ సీటర్ గ్లైడర్‌లో ఎక్కాడు. టేకాఫ్ సమయంలో గాలి తగిన రీతిలో వేగంగా.. ముందుకు పోకపోవడంతో గ్లైడర్ సరైన ఎత్తుకు లేచిపోలేదు. ఒక్కసారిగా నేలపై పడిపోయింది. ఈ ఘటనలో సతీష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, పైలట్ సూరజ్‌ను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల జరిగిన మరో దుర్ఘటన:
ఇదే టేకాఫ్ సైట్‌లో ఈ ఏడాది ప్రారంభంలో, జనవరిలో మరొక విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌కు చెందిన భావ్‌సర్ ఖుషీ అనే యువతి టేకాఫ్ సమయంలో.. గ్లైడర్ కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ రెండు ఘటనలూ గమనిస్తే, టేకాఫ్ సమయంలో భద్రతా లోపాలు ఉందని స్పష్టమవుతోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇక్కడ రెండు మృత్యువాతలు చోటుచేసుకోవడం.. పర్యాటకులలో తీవ్ర భయాందోళన నెలకొంది.
అధికారులు స్పందన:
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ కమిషనర్.. మాధవి శర్మ మీడియాతో మాట్లాడారు. ఇంద్రనాగ్ పారాగ్లైడింగ్ టేకాఫ్ పాయింట్ వద్ద.. ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 15 వరకు పారాగ్లైడింగ్ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధిస్తున్నాం అని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రాధాన్యతతో.. నష్ట పరిహారం అందించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
భద్రతా లోపాలపై ప్రశ్నలు:
ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకుల భద్రతపై.. సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పారాగ్లైడింగ్ నిర్వహించేవారు తగిన అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభమైంది. టూరిజం శాఖ అధికారులు సైతం టేకాఫ్, ల్యాండింగ్ పాయింట్లను పునః సమీక్షించాలని నిర్ణయించారు. పర్యాటకుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా.. భద్రతా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని.. పర్యాటక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బాధిత కుటుంబంలో విషాదం:
సతీష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చిన యువకుడు.. తిరిగి మృతదేహంగా చేరతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మశాలకు చేరుకుని మృతదేహాన్ని స్వీకరించారు. ప్రభుత్వ సహాయం కోరుతూ.. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: బైక్ మీద తీసుకెళ్లి గండికోటలో.. ఇంటర్ విద్యార్థిని దారుణంగా
హిమాచల్ ప్రదేశ్‌లోని ఇంద్రనాగ్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం.. పర్యాటక భద్రతపై పెనుసందేహాలు కలిగిస్తోంది. కేవలం ఎడ్వెంచర్ అనుభవాల కోసం వెళ్లే ప్రజల జీవితాలను గాలికి వదిలేయకూడదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పారాగ్లైడింగ్ వంటి యాడ్వెంచర్ క్రీడల నిర్వహణలో కఠిన నియంత్రణలు, శిక్షణా ప్రమాణాలు ఉండేలా చూడాలి.
ప్యారా గ్లైడింగ్ చేస్తూ కిందపడి 25 ఏళ్ల యువకుడు మృతి
హిమాచల్‌లోని ఇంద్రునాగ్లో పారాగ్లైడర్ కూలిపోవడంతో అహ్మదాబాద్‌కు చెందిన సతీష్ (25) మృతి చెందగా, పైలట్ సూరజ్ గాయపడ్డాడు. జనవరిలో ఇదే స్థలంలో భావ్‌సర్ ఖుషీ (19) మృతి చెందింది. 6 నెలల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో సెప్టెంబర్ 15… pic.twitter.com/2E9xZgo6fz
— ChotaNews App (@ChotaNewsApp) July 15, 2025