BigTV English

Mehar Ramesh : ఇంకెంత మందిని నాశనం చేస్తావ్ డైరెక్టర్… దయచేసి ఆ ఆలోచన మానుకో

Mehar Ramesh : ఇంకెంత మందిని నాశనం చేస్తావ్ డైరెక్టర్… దయచేసి ఆ ఆలోచన మానుకో

Mehar Ramesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈనెల 24న సినిమా రిలీజ్ కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్. ఎన్నో వాయిదాల తర్వాత మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. మరోవైపు ‘ఓజీ’ కూడా కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. దీనిపై హైప్ బాగానే ఉంది. వీటితో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‌పై ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కంగారు పడే న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఈ విషయం పై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.


పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ మూవీ..

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇది జరిగి కొన్ని రోజులు అయ్యింది. మరి ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ఆ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పవన్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే మెహర్ రమేశ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ‘బిల్లా’ తప్పితే మిగతా చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. రీసెంట్గా ఆయన తెరక్కించిన చిరంజీవి బోలాక్ శంకర్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది.. అన్నయ్య చిరంజీవికి ఘోరమైన డిజాస్టర్ ఇచ్చిన మెహర్ రమేశ్.. ఇప్పుడు పవన్‌తో కచ్చితంగా సినిమా తీస్తాననడంతో పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ వీడియో లీక్… పవన్ కటౌట్ చూస్తే పిచ్చిక్కిపోతుంది మావా..

పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యొద్దు.. 

మెహర్ రమేష్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తున్నారు.. మెహర్ రమేష్ గారు దయచేసి నన్ను నిర్ణయాన్ని మార్చుకోండి నాకు ఆశయం గొప్పదే అవ్వొచ్చు. మీకు కోరిక లు ఉండొచ్చు తప్పు లేదు కానీ మీ వల్ల ఎంత మంది డిస్ట్రిబ్యూటర్స్ రోడ్ మీదికి వచ్చారు. భోళా శంకర్ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి.. మళ్లీ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఒక ప్రొడ్యూసర్ ని కనపడకుండా చేసారు. ఇంకో ప్రొడ్యూసర్ ని దేశం వదిలి వెళ్ళేలా చేసారు.. మీరు మాత్రం బాగానే ఉన్నారు..దయించి మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీస్.. అంటూ సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. అటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. చేస్తున్న ప్రాజెక్టులు తప్పితే కొత్తగా ఏవి ఒప్పుకొనే స్థితిలో లేరు. కానీ ఎక్కడ మెహర్ రమేశ్ ఒప్పించేస్తాడోనని కంగారు పడుతున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో..

Related News

SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?

Allu Arjun – Pawan kalyan : అల్లు అర్జున్ ను పవన్ కాపీ కొడుతున్నాడా..? ఇదిగో ప్రూఫ్..

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Big Stories

×