BigTV English

Gavaskar – KL Rahul : టీమిండియా ఓటమికి కుట్ర… అంపైర్లతో కలిసి ఇంగ్లాండ్ ప్లాన్

Gavaskar – KL Rahul : టీమిండియా ఓటమికి కుట్ర… అంపైర్లతో కలిసి ఇంగ్లాండ్ ప్లాన్

Gavaskar – KL Rahul : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్ లు జరిగిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో టీమిండియా సులభంగా విజయం సాధిస్తుందనుకున్న తరుణంలోనే పేలవ ప్రదర్శన కనబరిచి ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా ఓటమి పై స్పందించారు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి కి కుట్ర జరిగిందని ఆరోపించాడు. ఈ మ్యాచ్ చివరి రోజు ఆటలో కే.ఎల్. రాహుల్ విధానం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ హాక్ -ఐ టెక్నాలజీ పై సందేహం వ్యక్తం చేశాడు. అంపైర్ల నిర్ణయాలు భారత్ కి వ్యతిరేకంగా.. ఇంగ్లాండ్ కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాడు. తాజాగా గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. 


Also Read :  Siraj – Javagal Srinath: 1999 హిస్టరీ రిపీట్… అప్పుడు పాకిస్తాన్.. ఇప్పుడు ఇంగ్లాండ్.. సిరాజ్ వికెట్ పై రచ్చ

రాహుల్ LBW


ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో టీమిండియా ఓటమికి కుట్ర జరిగిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆరోపించాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన కే.ఎల్. రాహుల్.. రెండో ఇన్నింగ్స్ లోనూ 39 పరుగులతో నిలకడగా ఆడాడు. అయితే చివరి రోజు ఆట తొలి సెషన్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లాండ్ డీఆర్ఎస్ తీసుకొని ఫలితం రాబట్టింది. బాల్ ట్రాకింగ్ లో బంతి లెగ్ స్టంప్స్ తాకుతున్నట్టు చూపించడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు.  ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న గవాస్కర్.. హాక్ ఐ టెక్నాలజీ పై సందేహం వ్యక్తం చేసాడు. ఇక ఇదే తరహాలో సిరాజ్ బౌలింగ్ లో జోరూట్ వికెట్ల ముందు దొరికిపోతే రిప్లేలో బాల్ ట్రాకింగ్ లో విభిన్నంగా చూపించారని.. బంతి లెగ్ స్టంప్స్ తాకినా అంపైర్స్ కాల్ గా ఇచ్చారని గుర్తు చేసాడు. కానీ రాహుల్ విషయంలో మాత్రం ఔట్ ఇవ్వడం చూస్తుంటే.. ఏదో కుట్ర జరిగినట్టు అనిపిస్తుందని తెలిపాడు.

బాల్ ట్రాకింగ్ లో ఆశ్చర్యం.. 

ఇక్కడ ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే..? ఇంగ్లాండ్ బౌలర్ల బంతులు బాల్ ట్రాకింగ్ లో బౌన్స్ కావడం లేదు. కానీ భారత బౌలర్ల బంతులు మాత్రమే స్టంప్స్ కంటే ఎత్తులో దూసుకెల్లినట్టు రిప్లే లో కనిపించాయి. ఈ టెక్నాలజీ పై నాకు సందేహం కలుగుతోందని.. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని గవాస్కర్ పేర్కొనడం గమనార్హం. గవాస్కర్ ఆరోపణలపై మాట్లాడేందుకు సహచర కామెంటేటర్ మైకెల్ వాన్ నిరాకరించాడు. ఇక నెటిజన్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అంపైర్ల పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంపైర్లు పూర్తిగా ఇంగ్లాండ్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోఫల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Irfan Pathan: మా కెరీర్ నాశనం చేసిన కిరాతకుడు.. ధోనిపై పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Dhanashree Verma: రణబీర్ కపూర్‌కు దగ్గరైన ధనశ్రీ వర్మ….హెల్త్ ట్రీట్మెంట్ ఇచ్చి !

Rohit Sharma: రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 2036 వరకు ఆడేందుకు బిగ్ ప్లాన్ !

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Big Stories

×