Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జలగావ్‌లో రైలు దిగి పట్టాలు దాటుతున్న ప్రయాణికులపైకి మరో రైలు దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం.
వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తూ పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణకులు ట్రైన్ నుంచి బయటకు దూకారు. ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయాణికులు కిందకు దిగి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంతలోనే ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చాలా మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.
జల్గావ్‌లోని పచోరాలోని పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దాదాపు 40 మంది ప్రయాణికుల వరకు పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కొరకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రైలులో మంటలు.. 20 మంది మృతి..
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు
భయాందోళనతో ట్రాక్ పైకి దూకేసిన ప్రయాణికులు
ఎదురుగా వస్తున్న ట్రైన్ ఢీకొని 20 మంది మృతి pic.twitter.com/I3PyYOZUoV
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025