Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- ఖమ్మం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారు ప్రమాదానికి గురవడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఒక కారు హైదరాబాద్ నుండి ఖమ్మం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మోతే మండలం రాఘవ పురం స్టేజి సమీపానికి చేరుకోగానే.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుయింది.
ఈ దారణ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారు నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై మోతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రేమ నిరాకరణ.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!