Maharashtra Crime News: ఆదాయపు పన్ను శాఖలో ఆయనొక ఉద్యోగి. జాబ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత లైఫ్‌లో సెటిలై పోవచ్చని భావించాడు. జీవితం మంచిగా ఉండాలని రకరకాల ప్లాన్స్ వేసుకున్నాడు. ఆయన భావించినట్టుగా ఇంట్లో వెతికి మరీ పెళ్లి సంబంధాలు చూశారు. అమ్మాయి నచ్చడంతో సంబంధం ఓకే అయ్యిం ది. పెళ్లికి సిద్దమవుతున్నారు. అంతలో కాబోయే భార్యని వేధింపులు మొదలయ్యాయి. ఆ టార్చర్ తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆదాయపు పన్నుశాఖలో అధికారిగా పని చేస్తున్నారు హరేరామ్ సత్యప్రకాష్ పాండే. ఆయన వయస్సు దాదాపు 36 ఏళ్లు. ఉద్యోగం రావడంతో సత్యప్రకాష్‌కు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చివరకు వారణాసికి చెందిన మోహిత్ పాండేతో వివాహం ఓకే అయ్యింది. దీంతో సత్యప్రకాష్ పాండే ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పెళ్లి తర్వాత కొత్త జీవితం ఎలా ఉండాలి అనేదానిపై కలలు కంటున్నాడు.
నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అక్కడే అసలు సీన్ క్రియేట్ అయ్యింది. ఎంగేజ్‌మెంట్ రోజు ప్రియుడు సురేష్ షాండేను కౌగిలించుకుంది మోహిని. అది చూసి సత్యప్రకాష్ పాండేకు నోటి మాట రాలేదు . ఆ సన్నివేశాన్ని అందరు చూసి షాకయ్యారు. అక్కడి నుంచి సత్యప్రకాష్ పాండే మనసులో రకరకాల ఆలోచనలు. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి చేసినట్టు భావించాడు.
నిశ్చితార్థంలో అసలు సినిమా
ప్రియుడ్ని వదిలేస్తే తాను పెళ్లి చేసుకుంటానని కాబోయే భార్యతో చెప్పేశాడు సత్యప్రకాష్ పాండే. ఏదొకటి తేల్చుకోమని కాబోయే భార్యకి సలహా ఇచ్చేశాడు. అందుకు నిరాకరించింది.. ఆపై బెదిరింపులకు దిగింది ఆమె. రోజు రోజుకీ ఆమె నుంచి టార్చర్ పెరిగిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేకపోయాడు. కనీసం చెబితే సలహా ఇచ్చేవారు. ఈ విషయమై లోలోపల కుమిలిపోయేవాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైనా జరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని భావించాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు సత్యప్రకాష్ పాండే.
ALSO READ: కొన్ని గంటల్లో పెళ్లి, రైలు పట్టాలపై శవమై తేలాడు వరుడు
అయితే హరేరామ్ ఇంటి బయట నాలుగైదు ఈ వ్యవహారంపై తర్జన భర్జన జరుగుతోంది. ఈ వ్యవహారం పెద్దది అవుతుందని భావించిన పొరుగువారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా శవమై కనిపించాడు హరేరామ్. ఒక ప్రభుత్వ అధికారి, పెళ్లికాని వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు అనేదానిపై దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హరేరామ్ సోదరుడు హరేకృష్ణ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆత్మహత్యకు ప్రేరేపించిన మోహిని, సురేష్, మయాంక్ మునేంద్ర పాండే కేసు నమోదు చేశారు పోలీసులు.హరేరామ్‌పై వేధింపుల వల్ల మానసిక స్థితిని దెబ్బతీసిందని, తమ్ముడు మరణానికి అదే కారణమని ఫిర్యాదులో ప్రస్తావించాడు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై మోహిని వైపు నుంచి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. పెళ్లికి ముందు భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకోవడం బహుశా ఇదే తొలిసారి అంటున్నారు చుట్టుపక్కల స్థానికులు.