Swimming in Summer: వేసవిలో స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది కేవలం రిలాక్సేషన్ కి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో ఈత కొట్టడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్విమ్మింగ్ అనేది గొప్ప, తక్కువ ప్రభావం చూపే క్రీడ. స్విమ్మింగ్ అన్ని వయసుల వారికి , ఫిట్‌నెస్ స్థయిలకు అనుకూలంగా ఉంటుంది.
శరీరం చల్లబడుతుంది:
వేసవిలో ఎండ తీవ్రత పెరిగే సమయంలో శరీరానికి చల్లదనం కలిగించే అత్యుత్తమ మార్గాలలో స్విమ్మింగ్ ఒకటి. నీటిలో కొంతసేపు గడిపితే శరీరంలోని వేడి బయటకు వెళ్లిపోతుంది. ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా.. ఉబ్బసం, నీరసం వంటి సమస్యలను నయం చేస్తుంది. స్విమ్మింగ్ ఒక సంపూర్ణ శరీరానికి వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఈత కొట్టేటప్పుడు చేతులు, కాళ్లు, మెడ ఇలా ప్రతి భాగం కదలడం జరుగుతుంది. ఇది కండరాల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరులోనూ మెరుగుదల వస్తుంది.
శరీరం ఫిట్‌గా ఉండటం:
ఈత కొట్టడం ఒక వ్యాయామం లాంటిదే, కాబట్టి నిపుణులు కూడా వేసవిలో ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ఈత మంచి ఎంపిక. ఈత బరువు తగ్గటానికి గొప్ప వ్యాయామం, స్విమ్మింగ్ చేయడం వల్ల కేలరీలు కరిగిపోతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో పాటు శరీర ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్విమ్మింగ్ శరీరంలో ఏ కణజాలం పై ఒత్తిడి చేయని వ్యాయామం, కాబట్టి వెన్నునొప్పి, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది గొప్ప వ్యాయామం. అంతే కాకుండా స్విమ్మింగ్ ఒక ఆహ్లాదకరమైన కార్యకలాపం. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి నీటిలో కేరింతలు కొడుతూ గొప్ప వినోదాన్ని పొందవచ్చు, ఇది మీ ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
ఆకలిని పెంచుతుంది:
అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. స్విమ్మింగ్ చేయడం వల్ల ఆకలి పెరుగుతుందని మీకు తెలుసా? అవును స్విమ్మింగ్ చేయడం వల్ల ఆకలి పెరగుతుంది. ఎండలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు డీహైడ్రేషన్ కలుగుతుంది, ఇది ఆకలిని పెంచుతుంది. అయితే ఇది ఎక్కువ సంఖ్యలో కేలరీలను బర్న్ చేయగలదు. శరీరం వినియోగించే దానికంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేసినప్పుడు, అది శక్తి నిల్వలను తిరిగి నింపడానికి ఆకలి సంకేతాలను ప్రేరేపిస్తుంది. అందుకే, ఈత కొట్టిన తర్వాత, శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, ఎక్కువ ఆహారం తీసుకోవడానికి మెదడుకు సిగ్నల్ వెళ్తుంది, తద్వారా ఆకలి పెరుగుతుంది. కాబట్టి మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు బాగా ఆకలివేస్తుంటే కాసేపు స్విమ్మింగ్ చేయడం మానేసి, ఏదైనా తినండి, ఆకలి తీరిన వెంటనే మళ్లి మీరు మీ ఈతను కొనసాగించవచ్చు.
Also Read: ప్లాస్టిక్ బాక్సుల్లోని ఫుడ్‌తో క్యాన్సర్ రిస్క్?
ఈ సమయంలో సన్ స్క్రీన్ తప్పక వాడాలి:
స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల వ్యక్తిత్వంలో మంచి మార్పు వస్తుంది. అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువతకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో స్విమ్మింగ్ చేయాలంటే సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. ఇది చర్మాన్ని హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి కాపాడుతుంది.
స్విమ్మింగ్ చేసే ముందు ఈత కొట్టే స్థలం పరిశుభ్రంగా ఉందో లేదో, నీటి ఉష్ణోగ్రత సరిపోతుందో లేదో, మీ శారీరక స్థితి బాగుందో లేదో చూసుకోవాలి.