Rishab Shetty: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కొందరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ ను చేస్తుంది. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టికి కాంతార సినిమా అలాంటిదే. కన్నడలో లవ్ స్టోరీస్ కు దర్శకత్వం వహిస్తూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. అసలు కాంతార రాకముందు వరకు తెలుగు ప్రేక్షకులకు రిషబ్ ఎవరో తెల్సింది లేదు. ఆ ఒక్క సినిమా అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా నిలబెట్టింది.
కాంతార తరువాత రిషబ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. పాన్ ఇండియా సినిమాలే అయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొదలయ్యింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుంది. హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో హనుమంతుడు ..రాముడికి ఒక మాట ఇస్తాడు. ఆ మాట ఏంటి.. ? రాముడికి ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకున్నాడా.. ? లేదా.. ? అనేది ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో చూపించబోతున్నాడు.
ఇక జై హనుమాన్ లో ఏ రానానో.. ప్రభాస్ నో హనుమంతుడిగా చూపిస్తారు అనుకుంటే రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నాడని ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించారు. కొంతమంది హనుమంతునిగా రిషబ్ ను ఓకే చేయగా.. మరికొంతమంది తమకు నచ్చలేదని పెదవి విరిచారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోకుండా చిత్రబృదం షూటింగ్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది.
Siddique : లైంగిక వేధింపుల కేసులో సాలిడ్ సాక్ష్యాలు… నటుడికి మెడకు బిగుస్తున్న ఉచ్చు
హనుమంతుడి పాత్రలో నటించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటేనే అలాంటి పాత్రలు వస్తాయి. ఇక రిషబ్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో కానీ, ఐకానిక్ రోల్స్ అన్ని ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఛత్రపతి మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.207 కోట్లు వసూలు చేసి షాక్ ఇచ్చింది.
ఇక శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకున్న అభిమానులు ఛత్రపతి మహారాజ్ కథ తెలుసుకోవడానికి ఊవిళ్లురుతున్నారు. దీంతో అభిమానుల ఆసక్తిని గమనించిన మేకర్స్ తాజాగా ఛత్రపతి మహారాజ్ జీవిత కథను తెరకెక్కిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఛత్రపతి మహారాజ్ గా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ఒక పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు.. టెక్నీషియన్స్ ను కూడా అనౌన్స్ చేశారు.
ది ప్రైడ్ అఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2027 జనవరి 21 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. తెలుగులో జై హనుమాన్.. హిందీలో ఛత్రపతి శివాజీ పాత్రలతో మెప్పించడానికి రిషబ్ రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమాలతో ఈ కాంతార హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.