BigTV English

UP Crime: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. రైల్లో ప్రసవం.. టాయిలెట్ లో బిడ్డ!

UP Crime: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. రైల్లో ప్రసవం.. టాయిలెట్ లో బిడ్డ!

మనుషులలో మానవత్వం రోజు రోజుకు మాయం అవుతోంది. వాయి వరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని మోరాదాబాద్ లో జరిగింది. ఓ మైనర్ బాలిక రైల్లో బిడ్డకు జన్మనిచ్చింది. శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిజం తెలిసి అందరూ షాకయ్యారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్ జంక్షన్‌ లోని ఓ రైలు టాయిలెట్‌ లో ఒక శిశువును వదిలేసి వెళ్లారు. సమ్మర్ స్పెషల్ ట్రైన్ జనరల్ కోచ్‌ లోని వాష్‌ రూమ్‌ లో ఒక బ్యాగ్‌ లో చిన్నారిని ప్రయాణీకులు గుర్తించి పోలీసులకు తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు, బ్యాగులో ఓ సిమ్ కార్డును కూడా గుర్తించారు. దాని ద్వారా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఆ శిశువుకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రే ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. అతడి వల్లే ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించారు. జూన్ 22న మైనర్ బాలిక కుటుంబం ఆమెను చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్తుండగా, ఆ బాలిక రైలు లోని వాష్‌ రూమ్‌ లో ప్రసవించింది. వెంటనే, కుటుంబ సభ్యులు నవజాత శిశువును ఒక బ్యాగ్‌ లో ఉంచి అందులోనే వదిలేశారు. ఆ తర్వాత బాలికను తీసుకొని సొంతూరికి వెళ్లిపోయారు.


Read Also: నాందేడ్ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

పోలీసులు ఏం చెప్పారంటే?

ఈ ఘటనకు సంబంధించి మొరాదాబాద్ జంక్షన్ రైల్వే పోలీసుల స్టేషన్ హెడ్ రవీంద్ర కీలక విషయాలు వెల్లడించారు. “జూన్ 22న సమ్మర్ స్పెషల్ రైలులో ఒక బ్యాగ్‌ లో ఒక శిశువు కనిపించింది.శిశువును ఆసుపత్రికి తరలించాం. బీహార్ కు చెందిన ఓ సిమ్ కార్డును కూడా బ్యాగ్ లో గుర్తించాం. ఆ సిమ్ ద్వారా ఆ శిశువు వివరాలను గుర్తించడం సులువుగా మారింది. సిమ్ కార్డు ఓపెన్ చేసి అందులోని నెంబర్స్ కు కాల్ చేస్తే, అసలు విషయం తెలిసింది. తన తండ్రి అత్యాచారం చేయడం వల్ల మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు తేలింది.  చికిత్స కోసం ఆమె కుటుంబం ఆ బాలికను ఢిల్లీకి తీసుకెళ్తుండగా  రైలులో బిడ్డకు జన్మనిచ్చింది. భయపడి, వారు శిశువును ఒక బ్యాగ్‌ లో ఉంచి జనరల్ కోచ్‌ టాయిలెట్ లో వదిలేశారు. ఆ తర్వాత సొంతూరుకు వెళ్లిపోయారు. బాధితురాలిని విచారిస్తే తన తండ్రి వల్లే తాను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పింది. తండ్రి తన మీద అత్యాచారం చేసినట్లు అంగీకరించింది. బాధితురాలిని కోర్టు హాజరుపరిచాం. వాంగ్మూలాలు నమోదు చేయబడ్డాయి. ఈ కేసు విచారణ కొనసాగుతోంది” అని ఆయన వివరించారు. ప్రస్తుతం శిశువు హాస్పిటల్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.

Read Also: నాందేడ్ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా తిరుపతికి స్పెషల్ ట్రైన్!

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×