BigTV English

Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?

Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?

Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని 4వ (బాక్సింగ్ డే) టెస్ట్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖలిస్థాని మద్దతుదారులు. మైదానంలో వారు {Khalistan Supporters} ఆందోళన చేయడం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విక్టోరియా పోలీసులు వారిని చెదరగొట్టారు. టికెట్ లేకుండా మైదానంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు.


Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?

ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారత అభిమానులు, ఖలిస్థానీ అనుకూల వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అప్రమత్తమైన విక్టోరియా పోలీసులు వారిని {Khalistan Supporters} అక్కడినుండి పంపించేశారు. కి ఘటనపై భారత అభిమానులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు అనవసరమైన ప్రచారం కల్పించవద్దని అన్నారు. వారు చేసిన ఆందోళనకు విలువ లేదని.. అసలు పంజాబ్ తో సంబంధమే లేని వ్యక్తులు వచ్చి కావాలనే గొడవ చేశారని వారు పేర్కొన్నారు.


ఇక మరోవైపు ఖలిస్థాని ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. 2025 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరగబోయే మహా కుంభమేళాలో{Khalistan Supporters} భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని చంపేస్తామంటూ ఓ వీడియోని విడుదల చేశారు. ముగ్గురు ఖలిస్థాని ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

అంతేకాదు 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ లోపు ఈ దాడులు చేస్తామని హెచ్చరించాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్య రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ప్రయాగ్రాజ్ లో ఉంటారు. ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుతుందని అతడు వార్నింగ్ ఇచ్చాడు. అయితే పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పోలీసు పోస్ట్ పై దాడి చేసిన కేసులో ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. వారు ఉత్తర ప్రదేశ్ లోని పిలిబిత్ లోని పురాణ పూర్ లో ఉన్నట్లు గుర్తించారు.

Also Read: Sam Konstas: బుమ్రా బౌలింగ్ లో తొలి సిక్స్‌ కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు…చరిత్రలో తొలిసారి!

అనంతరం వారు ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. దీంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ముగ్గురు ఖలిస్థాని కమాండో ఫోర్స్ కి చెందిన వారీగా గుర్తించారు. ఘటన స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోని విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×