Watch Showroom Loot| ఎంతో చాకచక్యంగా తెల్లవారుఝామున ఒకే ఒక్కడు ఒక వాచీలో షోరూం మొత్తాన్ని దోచేశాడు. అక్కడ ఉన్న బ్రాండెడ్ ఖరీదైన వాచీలన్నింటితో పాటు, షోరూమ్ లో ఉన్న లక్షల నగదు మొత్తం ఊడ్చి తీసుకెళ్లాడు. విచిత్రమేమిటంటే ఆ షోరూమ్ పోలీస్ స్టేషన్ పొరుగునే ఉంది. ఈ దొంగతనం కూడా చాలా తక్కువ సమయంలో ముగించేశాడు. పోలీసులు సైతం ఇది చాలా నైపుణ్యం ఉన్నవారు మాత్రమే చేయగలరని పరోక్షంగా దొంగతనం చేసే వాడి ప్రతిభను మెచ్చుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలో ఓ భారీ దొంగతనం జరిగింది. శుక్రవారం ఉదయం ఉదయం నాలుగు నుంచి అయిదు గంటల మధ్య నగరంలోని త్రికోణ్ బాగ్ అనే ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న షోరూం నుంచి మొత్తం రూ.70 లక్షలు విలువ చేసే నగదు, వాచీలు దొంగతనానికి గురయ్యాయి. త్రికోణ్ బాగ్ లో 24 గంటలు మనుషులు తిరుగుతూనే ఉంటారు. అలాంటిది చాలా ధైర్యంగా మెయిన్ ఎంట్రెన్స్ నుంచే వెళ్లి పక్కా ప్లానింగ్ తో ఓ దొంగ తన ప్లాన్ ని అమలు చేశాడు. ఈ దొంగతనం గురించి తెలిసి పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఘటనా స్థలానికి విచ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నగర పోలీస్ కమిషనర్ బ్రజేష్ కుమార్ ఝా, డెప్యూటీ కమిషనర్, డిసిపి, డివిజన్ పోలీసు అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చాలా టెక్నికల్ జరిగిన ఈ చోరీ గురించి వివరాలు సేకరించారు. పోలీసులు కథనం ప్రకరాం.. సిసిటీవి వీడియోలను పరిశీలించగా.. శుక్రవారం ఉదయం 4.42 గంటల నుంచి 5.05 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. కేవలం 23 నిమిషాల వ్యవధిలో దొంగ పని మొత్తం కానిచ్చేశాడు. షాకింగ్ విషయమేమిటంటే దొంగతనం జరిగినా అలార్మ్ మాత్రం మాత్రం మొగలేదు. షూరూమ్ యజమాని రవి చోటాయి స్థానిక పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం..షూరూం నుంచి మొత్తం 102 ఖరీదైన బ్రాండెడ్ వాచీలు చోరీ అయ్యాయి. అందులో నెబులా బ్రాండ్ 19 వాచీలు విలువ రూ.45.53 లక్షలు, 34 గైల్స్ వాచీలు విలువ రూ.9.94 లక్షలు, 16 రాగా వాచీలు విలువ రూ.2.4 లక్షలు, 16 సీకో బ్రాండ్ వాచీలు విలువ రూ.6.06 లక్షలు.. అలాగే రూ.2.55 లక్షలు విలువ గల 17 గెస్ బ్రాండ్ వాచీలు దొంగతనం అయ్యాయి. వీటితోపాటు డ్రాయర్ లో ఉన్న రూ.4 లక్షలు నగదు కూడా చోరీ అయింది. దొంగతనం గురించి ఉదయం షోరూమ్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది.
Also Read: ప్రపంచంలోనే తొలిసారి వీర్య కణాల రేసింగ్ పోటీలు.. బెట్టింగ్ వేస్తారా?
దొంగతనం ఎలా జరిగింది?
మీడియాతో అసిస్టెంట్ పోలీస్ కమిషన్ బిజె చౌదరి మాట్లాడుతూ.. దొంగ షూరూమ్ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారానే లోపలికి వెళ్లాడు. షట్టర్ ని ఒక పెద్ద జాకీ లాంటి పరికరంతో పైకి ఎత్తి లోపలికి వెళ్లగలిగాడు. సిసిటీవి వీడియో ప్రకారం.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఆ దొంగ లోపలున్న అన్ని వాచీలు, నగదును చాలా తక్కువ సమయంలో ప్యాక్ చేసుకొని బయటికి వచ్చేశాడు. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళితే అలారం మోగదని ఆ దొంగకు ముందుగానే తెలుసునని. ఇది షోరూమ్ గురించి పక్కాగా తెలిసిన వ్యక్తి మాత్రమే చేయగలడని చెప్పారు. “అంతకుముందు రోజు, వారం రోజుల సిసిటీవి వీడియోలను పరిశీలిస్తున్నాం. దొంగ ఒక్కడే లోపలికి వెళ్లినా బయట మరో ఇద్దరు ఉన్నట్లుగా అనుమానం ఉంది. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణలు ఇప్పటికే పనిలో పడ్డారు. దొంగ తప్పకుండా రెక్కీ చేసే ఉంటాడు. తమకు అనుమాస్పందగా అనిపించే వ్యక్తిని గుర్తించి పట్టుకుంటాం”, అని పోలీసులు తెలిపారు.