BigTV English

Greenest Railway Stations: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూడాల్సిందే బ్రో!

Greenest Railway Stations: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూడాల్సిందే బ్రో!

Indian Railways: ప్రపంచంలోనే అదిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటి. దేశ వ్యాప్తంగా లక్ష కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లు ఉన్నాయి. ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన బ్యూటీఫుల్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు చూద్దాం..


⦿ హాఫ్లాంగ్‌ రైల్వే స్టేషన్, అస్సాం

భారతీయ రైల్వే సంస్థ అధికారికంగా గుర్తించిన అత్యంత గ్రీనిష్ రైల్వే స్టేషన్ ఇది. అస్సాంలోని పాస్టోరల్ దిమా హసావో జిల్లాలో ఉంది. హాఫ్లాంగ్‌ స్టేషన్ గౌహతి- సిల్చార్‌ మధ్యంలో ఉంటుంది. పచ్చని అస్సాం కొండల మధ్య కనువిందు చేస్తుంది. పర్యావరణ హితమైన గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఇక్కడ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.


⦿ కాత్గోడం రైల్వే స్టేషన్, ఉత్తరాఖండ్‌

అద్భుతమైన శివాలిక్ కొండల మధ్య ఈ రైల్వే స్టేషన్ నిర్మించబడింది. డెహ్రాడూన్- కాత్గోడంలను కలిపే మార్గంలో  ఇదో ప్రధాన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ దేశంలోని అత్యంత పచ్చని రైల్వే స్టేషన్లలో ఒకటి. ఒక్కడ సోలార్ ప్యానెల్స్, వర్షపు నీటి సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ లాంటి సౌకర్యాలను కలిగి ఉంది. ఈ మార్గం ద్వారా న్యూఢిల్లీ-కాట్గోధమ్ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, లక్నో జంక్షన్-కాట్గోధమ్ ఎక్స్‌ ప్రెస్, రాణిఖేత్ ఎక్స్‌ ప్రెస్, ఉత్తరాఖండ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ ప్రెస్ సహా పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.

⦿ కార్వార్ రైల్వే స్టేషన్, కర్ణాటక

కర్ణాటక అద్భుమైన పర్యాటక ప్రదేశాలకు నిలయం. రాష్ట్రంలోని కార్వార్ రైల్వే స్టేషన్ కర్నాటకలో అత్యంత అందమైన రైల్వే స్టేష్. బెంగళూరు- ముంబై నగరానికి అనుసంధానించే ప్రధాన రైలు మార్గంలో ఉంటుంది. 1857లో బ్రిటిషర్స్ నిర్మించారు.  కర్ణాటక కాశ్మీర్ గా ఈ రైల్వే స్టేషన్ ను పిలుస్తారు. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఈ స్టేషన్ ఢిల్లీ, జైపూర్, ఇండోర్, ఎర్నాకులం, కోయంబత్తూర్ లాంటి నగరాలను కూడా కలుపుతుంది. వర్షాకాలంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం కార్వార్ రైల్వే స్టేషన్.

⦿ దూద్ సాగర్ రైల్వే స్టేషన్, గోవా

దేశంలోని ప్రతి పర్యాటకుడు ఇష్టపడే ప్రాంతం గోవా. అద్భుతమైన బీచ్ లలో ఎంజాయ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులు గోవాకు తరలివస్తారు. దేశంలోని అత్యంత పచ్చని స్టేషన్లలో ఒకటిగా దూద్ సాగర్ రైల్వే స్టేషన్‌ గుర్తింపు తెచ్చుకుంది. గోవా, కర్ణాటక మధ్య సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది.  షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్’ షూటింగ్ కూడా దూద్‌సాగర్ జలపాతాల దగ్గరే జరిగింది.  అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది.

⦿ సిమ్లా రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్

దేశంలో అత్యంత అంతమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకునే సమయంలో సిమ్లా కచ్చితంగా తలచుకోవాల్సిందే. దేశంలో అత్యధికంగా సందర్శించబడే హిల్ స్టేషన్లలో సిమ్లా ఒకటి. దేశ వ్యాప్తంగా ఉన్న అందమైన రైల్వే స్టేషన్లలో సిమ్లా రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ చుట్టూ అందమైన పర్వతాలు, దట్టమైన పచ్చని అడవులు ఉన్నాయి. స్టేషన్ చుట్టూ పచ్చదనాన్ని మెయంటెనెన్స్ చేయడానికి భారతీయ రైల్వే సంస్థ చెట్లను నాటడం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యర్థాల నిర్వహణ చేపడుతోంది. ఇక్క భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి  వర్షపు నీటి సేకరణ వ్యవస్థ కూడా ఉంది.

Read Also: కత్రా-శ్రీనగర్ రైల్వే లింక్ ప్రారంభోత్సవం వాయిదా, కారణం ఇదే!

Related News

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Big Stories

×