Wife Assaulted Infront Husband| ఓ భార్యాభర్తల జంట అర్ధరాత్రి దాటాక కాలినడకన ఒక కొత్త ప్రాంతంలో కాలినడకన వెళుతుండగా.. దారిలో ముగ్గురు యువకులను చూసి తాము రైల్వే స్టేషన్ చేరుకోవాలని కాస్త అడ్రస్ చెప్పాలని కోరారు. అయితే ఆ ముగ్గురు తాము కూడా రైల్వే స్టేషన్ కే వెళుతున్నామని నమ్మించి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ భర్తను చితకబాది, కాళ్లు చేతులు కట్టిపడేశారు. ఆ తరువాత అతని భార్యను కూడా కృూరంగా చితకబాది ఆమెపై ఆ ముగ్గురూ పాశవికంగా అత్యాచారం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్ రాష్ర రాజధాని పట్నా సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాజధాని పట్నా నగరం సమీపంలోని షాహ్‌పూర్ దేరా గ్రామంలో గత బుధవారం ఏప్రిల్ 30న ఒక భయానక ఘటన జరిగింది. పట్నాలో నివసించే ఒక యువతి వృత్తి రీత్యా ఆమె ఒక డాన్స్ ఆర్టిస్ట్ (నృత్య కళాకారిణి). మంగళవారం ఆమె నగర సమీపంలోని షాహ్‌పూర్ దేరా గ్రామంలో నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా వెళ్లారు.
కార్యక్రమం ముగిసే సమయానికి అర్ధరాత్రి కావడంతో ఆ యువతి తన భర్తతో అక్కడ ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. అయితే అక్కడ సరైన వసతులు లేక.. ఇక తాము పట్నాకే బయలుదేరడం మంచిదని భావించారు. కానీ ఆ సమయానికి బస్సు, ఆటో లాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న దిఘ్వారా రైల్వే స్టేషన్ కు చేరుకుంటే అక్కడి నుంచి పట్నా వెళ్లిపోవచ్చునని తెలుసుకున్నారు. అందుకే కాలినడకన రైల్వే స్టేషన్ కు బయలుదేరారు. కానీ వారికి రైల్వే స్టేషన్ వెళ్లాల్సిన మార్గం తెలియదు.
Also Read: ఇంటి పని చేసే ఉద్యోగం.. జీతం రూ.83 లక్షలు.. ఎగబడుతున్న జనం
అందుకే కాస్త దూరం వెళ్లాక ఎవరినైనా రైల్వే స్టేషన్ కు ఎటు వెళ్లాలో అడగాలని అనుకుంటుండగా.. ఆ దారిలో ముగ్గురు యువకులు బైకులపై వచ్చారు. వారిని ఆపి ఆ భార్యాభర్తలు తమకు రైల్వే స్టేషన్ కు ఎటు వెళ్లాలో చెప్పమని కోరారు. కానీ ఆ యువకులు ఆ డాన్స్ ఆర్టిస్ట్ యువతి అందం చూసి కామాంధులయ్యారు. అందుకే తాము కూడా రైల్వే స్టేషన్ కే వెళుతున్నామని.. తమతో బైక్ల పై రావాలని చెప్పారు. అలా వారితో వెళ్లిన ఆ దంపతులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ ముగ్గురు యువకులు వారిని రైల్వే స్టేషన్ కు బదులు ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆ యువతి భర్తను చితకబాదారు. అతడి కాళ్లు చేతులు కట్టేసి.. అతని ఎదురుగానే ఒకరి తరువాత ఒకరు అతని భార్యపై అత్యాచారం చేశారు. ఆ తరువాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు.
ఈ ఘటన తరువాత ఆ యువతి తేరుకొని అతి కష్టం మీద తన భర్త కాళ్లు చేతులు విప్పింది. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు 24 గంటల్లో ఆ ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. ముగ్గరు నిందితుల్లో మనోజ్ కుమార్, మనీష్ కుమార్ ని అరెస్టు చేయగా.. మూడో నిందితుడు నాగేంద్ర కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.