Meenakshi Chaudhary: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హీట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు లక్కీ భాస్కర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆ సినిమా భారీ విషయాన్ని అందుకోవడంతో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మీనాక్షి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వెంకీ ప్రియురాలిగా, ఐశ్వర్య రాజేష్‌కి సవతిగా, ఐపీఎస్ ఆఫీసర్‌గా వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. దీంతో అమ్మడి కెరీర్ దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇచ్చేలా ఈమె కెరీర్ ఏమాత్రం మారలేదని తెలుస్తుంది. ఎందుకు సీనియర్ హీరోలు మీనాక్షిని పక్కన పెడుతున్నారు? ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాం..
అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి..
టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి కూడా ఒకటి. ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరు తరఫున నటించిన ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నా మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఈమె కెరియర్ పూర్తిగా మారిపోతుందని అందరూ భావించారు. కానీ అందుకు వ్యతిరేకంగా మారిందని తెలుస్తుంది..చిన్న హీరోల సినిమాల్లో తప్ప పెద్ద హీరోలు ఆమెను కన్నెత్తి కూడా చూడటం లేదట. దీంతో వచ్చిన అవకాశాలనే సరిపెట్టుకుంటూ కెరీర్ కొనసాగిస్తోంది. అందుకు ఒక కారణం కూడా ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. అదేంటంటే ఆమె హైట్..
Also Read :సిస్టర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు… ట్రాన్స్ అనే కామెంట్ కి దిమ్మతిరిగే ఆన్సర్..
అదే మీనాక్షికి మైనసా..?
మనిషి అన్నకా ఏదో ఒకటి ఉంటుంది. ఇక హీరోయిన్లకు కచ్చితంగా ఏదో ఒకటి మైనస్ అవుతుంది.. అలాగే మీనాక్షి చౌదరికి కూడా ఆమె హైటే పెద్ద ప్రాబ్లం అయ్యిందని తెలుస్తుంది. టాలీవుడ్‌లో చాలామంది హీరోలు యావరేజ్ హైట్‌తో కాస్త బొద్దుగా కనిపిస్తారు. ఇక హైట్‌ని ఏదో మేనేజ్ చేసినా ఆమె జీరో సైజ్‌తో బక్కగా కనిపించే ఆమెని తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందోనని హీరోలు భయపడుతున్నారని నెట్టింట రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఈ వార్తలు పై ఆమె ఫాన్స్ నెటిజెన్లు స్పందిస్తున్నారు.. ఇప్పటికైనా మీనాక్షి కాస్త బొద్దుగా మారితే బాగుంటుంది అని సలహాలిస్తున్నారు. మరి దీనిపై మీనాక్షి చౌదరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సరసన ‘అనగనగా ఓ రాజు’లో నటిస్తోంది. అలాగే ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు.. నాగచైతన్యతో తెరకెక్కించే సినిమాలో మీనాక్షిని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..