Jaggery water: వేసవిలో రూజువారి ఆహారంలో బెల్లం చేర్చుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం, శరీరాన్ని చల్లబరచడం, డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. బెల్లం ఒక అద్భుతమైన సహజ స్వీటెనర్. దీనిని చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెల్లం తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండేందుకు, వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరిచేందుకు మంచిదని వైద్యులు చెబుతున్నారు.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం
బెల్లం నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. వేసవిలో ఇది శరీరానికి చల్లగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బెల్లం నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్, కడుపులో మంట, ఎసిడిటీ మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండే బెల్లం తినడం వల్ల ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనతను నివారించవచ్చు. బెల్లం తినడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది అన్నవాహిక, ఊపిరితిత్తులు, పేగులను శుభ్రపరచడానికి పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెల్లంను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
శక్తిని అందిస్తుంది
బెల్లంలో సహజ చక్కెరలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి త్వరగా శక్తిని అందిస్తాయి. అలాగే ఇది వేడి, ఎక్కువగా ఉన్నప్పుడు వేడిని తగ్గించి ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. బెల్లం రక్తం శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం వల్ల శరీరంలో ఎర్రరక్తకణాలు పెరిగి రక్తహీనతను నివారిస్తుంది. బెల్లం పొటాషియం, సోడియం కలిగి ఉన్నందున, ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
ఎముకల నిర్మాణం
క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే గుండె జబ్బులు దరిచేరవు. బెల్లంలో ఉండే అధిక స్థాయి ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా నెలసరి సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకారకాయ ఆకులు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తరచుగా పొడి దగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పలు రకాల తయారి విధానాలు
బెల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో బెల్లం చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. అంతేకాదు, వేసవిలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల కొంతమందికి మలబద్ధకం సమస్యగా మారుతుంది. బెల్లం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
Also Read: కాఫీ తాగితే.. శరీరంలో జరిగేది ఇదే ?
వేసివిలో తరచూగా బెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం ఒక పెద్ద గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేసి కాస్త వేడిచేయాలి. బెల్లం కరిగిన తర్వాత, నీటిని వడకట్టాలి. నీరు చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. ఎండలు అలసిపోయినప్పుడు ఈ నీళ్లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి సమకూరుతుంది.. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.