BigTV English

HouseManager Job: ఇంటి పని చేసే ఉద్యోగం.. జీతం రూ.83 లక్షలు.. ఎగబడుతున్న జనం

HouseManager Job: ఇంటి పని చేసే ఉద్యోగం.. జీతం రూ.83 లక్షలు.. ఎగబడుతున్న జనం

HouseManager Job| మంచి జీతం, పెద్దగా నైపుణ్యం లేని ఉద్యోగం కోసం వెతుకుతున్నారా?.. ఇదిగో మీ కోసమే లక్షల్లో వేతనం వెంటనే దరఖాస్తు చేయండి. కేవలం ఇంటి పనిచేస్తే చాలు నెలకు రూ.7 లక్షలు జీతం, భోజనం, గృహ వసతి.. ఏడాదికి బోనస్ ఇవన్నీ ఇన్ సెంటివ్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఉద్యోగం గురించి నెటిజెన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఈ ఉద్యోగం కోసం ఇప్పటికే లక్షల మంది దరఖాస్తు చేశారు. మరి ఈ ఉద్యోగం ఎక్కడో తెలుసా?.. దుబాయ్ లో.


వివరాల్లోకి వెళితే.. దుబాయ్ కి చెందిన రాయల్ మైసన్ అనే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇటీవల ఒక ఉద్యోగం గురించి ఆన్ లైన్ లో యాడ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు హౌస్ మేనేజర్లు కావాలని అందులో ఉంది. అయితే ఆ పోస్ట్ లో నెల జీతం ఏకంగా 30000 దిర్హమ్స్ పేర్కొంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7 లక్షలు, మొత్తం ఏడాదికి రూ.83 లక్షలు. ప్రస్తుతానికి యుఎఈ దేశంలోని దుబాయ్, అబుదాబి స్టేట్స్ లో రెండు ఖాళీలు ఉన్నాయి. ఇలాంటి జాబ్స్ కు ఇదే అత్యధిక సాలరీ కావడం విశేషం. ఇంతటి వేతనం కార్పొరేట్ కంపెనీల్లో టాప్ పొజిషన్స్ లో ఉండేవారికి మాత్రమే ఇస్తారు.

ఇన్‌స్టాగ్రామ్ లో రాయల్ మైసన్ (Royal Maison) ఏజెన్సీ చేసిన పోస్ట్ లో ఇలా ఉంది. “మా టీమ్ తో కలిసి పనిచేసేందుకు ఇంటి పని చేయడంలో నైపుణ్యం ఉన్న ఫుల్ టైం హౌస్ మేనేజర్ల కోసం ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగం చేసేవారికి నెలకు 30,000 దిర్హంలు వేతనం. మంచి టాలెంట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది” అని పోస్ట్ లో ఉంది.


సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చాలా త్వరగా వైరల్ అయింది. దీంతో నెటిజెన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది అయితే తాము చేసే ఉద్యోగాలు కాదని వెంటనే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేస్తున్నామని రాశారు. “30,000 దిర్హంలు (రూ.7 లక్షలు సాలరీ) అంటే నేను చేస్తున్న ఉద్యోగం వేస్ట్ గా అనిపిస్తోంది. ఆతిథ్య రంగంలోకి మారడం బెటర్ కదా” అని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ అయితే.. “దుబాయ్ లో ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. లక్షల్లో జీతం అంటే చాలా ఎక్కువగా అనిపిస్తోంది. అంటే చాలా పెద్ద ఇంట్లో పని ఉంటుందేమో. పూర్తి పని వివరాలు తెలుసుకోవాలనుంది. అసలు అంత వేతనం నిజమేనా” అని కామెంట్ పెట్టాడు.

Also Read:  పాక్ సైనికులు పిరికిపందలు.. ఆర్మీ చీఫ్‌ని తిట్టిపోసిన పాక్ పోలీసులు

దీనిపై రాయల్ మైసన్ ఏజెన్సీ లో స్పష్టతనిచ్చింది. “బడా వ్యాపారవేత్తలు ఇంట్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. వారంతా క్రమశిక్షణగా ఉంటారు. వారు సెలబ్రిటీలు కాదు.. చాలా ప్రైవేట్ జీవితం కోరుకునేవారు. ఇక వేతనం గురించి చెప్పాలంటే.. అందరూ ఇంత వేతనం ఇవ్వకపోవచ్చు. కానీ ఈ ప్రత్యేక క్లయింట్స్ అంత సాలరీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు” అని స్పష్టం చేసింది.

ఇక జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం.. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు హౌస్ మేనేజర్లుగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పనిచేసే సిబ్బందిని మేనేజ్ చేయాలి, మెయింటెనెన్స్ పనులు సమయానికి జరిగేలా చూడాలి. ఇంటి బడ్జెట్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలి, ఇంటి సభ్యులకు, అతిథులకు హై క్వాలిటీ సర్వీస్ అందించాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా లగ్జరీ రెసిడెన్స్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు వెంటనే సివి లు పంపించాలని రాయల్ మైసన్ ఏజెన్సీ కోరింది.

Related News

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Big Stories

×