Maharashtra Crime News: ఈ మధ్యకాలంలో భర్తలను దారుణంగా చంపేస్తున్నారు భార్యలు. కారణాలు ఏమైనా కావచ్చు. దేశంలో ఆ తరహా ఘటనలు రోజుకు రెండు లేదా మూడు జరుగుతున్నాయి. తాజాగా థానెలో రాత్రి వేళ భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది భార్య. చివరకు ప్రియుడి సాయంతో చంపేసింది. మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా డ్రైనేజీలో పడేసింది. అసలు ఏం జరిగింది?
మహారాష్ట్రలోని థానెలో ఉంటున్నారు పూనమ్-కాళిదాస్ వాఘ్మారే దంపతులు. వీరికి వివాహం జరిగింది ఏడెనిమిదేళ్లు అవుతోంది. తొలుత సాఫీగా సాగిన సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. రోజురోజుకూ దంపతుల మధ్య అగాధం పెరుగుతోంది. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు మద్యానికి అలవాటుపడ్డాడు కాళిదాస్. రోజూ రాత్రివేళ తాగొచ్చి భార్యపై తన కోపాన్ని తీర్చుకునేవాడు. మొదట్లో లైట్‌గా పూనమ్, భర్త నుంచి రోజురోజుకూ టార్చర్ పెరిగింది. ఆ తర్వాత పూనమ్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తర్వాత మరింత ఆగ్రహానికి గురయ్యేవాడు కాళిదాస్.
విసిగిపోయిన పూనమ్ భర్తను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. జరిగిన.. జరుగుతున్న విషయాలను తన ప్రియుడు సురేష్ హరిప్రసాద్ యాదవ్ చెప్పింది. అతడి సహకారం కోరింది. మద్యం తాగుదామని కాళిదాస్‌ను బయటకు తీసుకువెళ్లాడు సురేష్ యాదవ్. వారిద్దరితోపాటు పూనమ్ వెంట వెళ్లింది.
ALSO READ: రెండు లారీలు-కారు ఢీ, భయానక వాతావరణం
కాళిదాస్ వాఘ్మారేకు ఫుల్‌గా తాగించడంతో స్పృహ కోల్పోయాడు. ఆ క్రమంలో పూనమ్, ఆమె ప్రియుడు సురేష్ యాదవ్ కలిసి కాళిదాసును హత్య చేశారు. పైగా ఆ మృతదేహం ఎవరికీ కనిపించకుండా ఘటన జరిగిన ప్రాంతంలోని డ్రైనేజీలోకి తోసేశారు. ఆ మృతదేహం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది.
ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు పరిశీలిస్తే.. భర్తను చంపేసింది. ఇరుగు పొరుగు వారు అడిగితే ఏం చెప్పాలి? వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏ విధంగా అడుగులు వేయాలని అనేదానిపై ఆలోచన పెట్టింది. చివరకు ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించలేడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
తొలుత పూనమ్‌ని పోలీసులు విచారించారు. అయితే పొంతన లేని సమాధానాలు పూనమ్ చెప్పింది. లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టేసింది నిందితురాలు. తన ప్రియుడు సురేష్ యాదవ్‌తో కలిసి భర్తను చంపేశానని తెలిపింది. పైన పేర్కొన్న కథంతా విడమరిచి చెప్పింది. దీంతో పూనమ్, ఆమె ప్రియుడు సురేష్‌ను అరెస్టు చేశారు.