Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఒకవైపు వరుస సినిమాలను ప్రకటిస్తూ.. ఈ వయసులో కూడా మరింత బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ప్రేక్షకులను అలరించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ లకు ఎక్కువగా అవకాశం ఇస్తున్న చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vasistha mallidi) దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara)చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘#చిరు 157’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి అభిమానులన్నా.. తనతో సినిమాలు చేసే దర్శకులన్నా అంతే ప్రేమ, గౌరవం. ముఖ్యంగా దర్శకులుగా మారిన అభిమానులు అంటే ఇంకా ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ఆ ఇష్టాన్ని వస్తువుల రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటారు చిరంజీవి.ఇక తనకు నచ్చిన అభిమాన దర్శకుడు, యువ దర్శకుడు ఎవరైనా మంచి సినిమా తీస్తే వారిని స్వయంగా పిలిచి అభినందించడం లేదా ఫోన్లో మాట్లాడడం లాంటివి ఎన్నో చేస్తుంటాడు. అయితే తన అభిమానుల్లో ఒకరిగా అలాగే తనకు భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబీకి చిరంజీవి అరుదైన గౌరవంతో పాటు కానుక కూడా అందించారు. అంతేకాదు ఆ కానుకను స్వయంగా ఆయన చేతులతోనే ధరింప చేయడం గమనార్హం.
బాబీకి చిరు మెగా గిఫ్ట్.. విలువ ఎంతంటే..?
ఇకపోతే తాజాగా బాబీ తన ఫేవరెట్ హీరో చిరంజీవి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ ను చూసి సంతోషపడ్డారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక చిరంజీవి కూడా బాబీ చేతికి స్వయంగా ఆ గడియారాన్ని తొడిగి, తన ప్రేమను వ్యక్తం చేశారు.ప్రస్తుతం చిరంజీవి బాబికి ఇచ్చిన వాచ్ విషయానికి వస్తే.. ఇది ఒమేగా బ్రాండ్ కి చెందిన ఒమేగా సీ మాస్టర్ డైవర్ 300ఎం . దీని ఖరీదు అక్షరాల రూ.4,88,335. ఈ ధర తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఖరీదైన వాచ్ డైరెక్టర్ కి బహుమతిగా ఇవ్వడంపై చిరంజీవిపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు
మళ్లీ బాబీ డైరెక్షన్లో చిరంజీవి..
ఇదిలా ఉండగా గతంలో చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా మరింత పెరిగిపోయింది. అటు చిరంజీవికి ఇష్టమైన దర్శకులలో బాబీ కూడా ఒకరిగా మారిపోయారు. ఈ సినిమా తీయడానికంటే ముందే బాబీ తనకు, తన కుటుంబానికి చిరంజీవి అంటే చాలా ఇష్టం అని, తన తండ్రి చిరంజీవి అభిమాని అని అలాంటి అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి, బాబి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవితో మరో సినిమా చేస్తున్నాను అని, తాను చెప్పిన కథ మెగాస్టార్ కి చాలా బాగా నచ్చింది అని, ఆ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ , ఇతర పనులు పూర్తయ్యాయి అంటూ బాబీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
also read:Ramya Krishnan: హీరోయిన్ అవ్వాలంటే బెడ్ ఎక్కాల్సిందే… ఇండస్ట్రీపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
A beautiful MEGA surprise from the Boss himself 🤩
Thank you dearest Megastar @KChiruTweets garu for this priceless gift 💝
Your love, encouragement, and blessings mean the world to me annaya 🙏 I’ll cherish this moment forever 🤗 pic.twitter.com/pkCXi3SozH
— Bobby (@dirbobby) May 22, 2025