Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇరుకుల వద్ద రెండు లారీలు, కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో రోడ్డుపై భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. కొందరు లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి రక్తమోడుతూ కనిపించారు. మరోవైపు రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోవడంతో అందులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వైపు వర్షం కురుస్తుండటంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: 70 Snakes: టాయిలెట్ ట్యాంక్‌లో 70 పాములు.. వీడియో చూస్తే వణికిపోతారు!