Wife Second Marriage| ఈ ప్రపంచంలో స్వార్థంగా ఆలోచించేవారికి కొరతలేదు. కానీ ఎంత స్వార్థమైనా తల్లిదండ్రులు, భార్యభర్తలు, కన్నబిడ్డల తరువాతే. అయితే ఈ ఇటీవలి కాలంలో భార్యభర్తలు తమ స్వార్థం చూసుకుంటూ కష్టాల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలబడడం లేదు. బహుశా వీరిని చూశాకే డబ్బు కోసం కుటుంబ సభ్యులను కూడా ద్రోహం చేసేవారున్నారని అనిపిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక మహా పతివ్రత గురించి ఇటీవలే తెలిసింది.
కొత్తగా వివాహం జరిగిన ఒక యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ఆస్పత్రిలో చికిత్స చేసుకుంటుండగా.. అతని భార్య కనిపించకుండా పోయింది. తీరా అతను ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వస్తే.. అది ఇక అతని ఇల్లు కాదు. అతని భార్య ఇంటి నుంచి అతడిని గెంటి వేసింది. ఎందుకంటే ఆమె మరొక యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ రెండో వివాహానికి అంగీకరించారు. దీంతో ఆ యువకుడు రోడ్డున పడ్డాడు. పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య తనను మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జైని నగరానికి చెందిన సునీత్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడికి 2021 డిసెంబర్ నెలలో పింకీ శ్రీవాస్తవ అనే 24 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. సునీల్ ఒక మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతను తరుచూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. పింకీ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అందుకే సునీల్ తన అత్తగారి ఇంట్లో ఇంటల్లుడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వివాహం జరిగిన మూడేళ్ల తరువాత మార్చి 2025లో సునీల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.
Also Read: శవం ముందు ప్రియురాలితో పెళ్లి.. తమిళనాడులో వింత వివాహం
ప్రారంభంలో ప్రతిరోజు అతడి కోసం అత్తమామలు, భార్య ఆస్పత్రికి వచ్చేవారు. కానీ కొన్ని రోజుల తరువాత వారంతా రావడం మానేశారు. ఫోన్ చేసినా ఎత్తడం లేదు. కానీ సునీల్ కాలు విరగడంలో ఆపరేషన్ చేయించుకొని ఆస్పత్రి నుంచి కదల్లేని పరిస్థితి. అలా 20 రోజులు గడిచాక ఆస్పత్రి నుంచి అతడు చికిత్స పొందిన తరువాత డిశ్చార్జ్ అయ్యాడు. తనకోసం ఎవరూ రాకపోవడంతో అతను ఆశ్చర్యపోయాడు. దీంతో ఒంటరిగానే తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లే.. అతడిని లోపలికి రానివ్వలేదు. విషయం ఏంటని ప్రశ్నిస్తే అతడి బట్టలు, ఇతర సామాను అంతా రోడ్డుపై పడేశారు. కారణం ఏమిటని ప్రశ్నిస్తే.. అప్పుడు పింకీ, ఆమె తల్లి ఒక షాకింగ్ విషయం చెప్పారు.
ఎందుకు చేసుకుందంటే?..
మరో ధనవంతుడైన యువకుడు.. పింకీని ప్రేమించాడట. అందుకే అతడితో పింకీ వివాహం జరిపించేశారట. పింకీ కూడా సునీల్ కంటే తన కొత్త భర్త ధనవంతుడని సంతోషంగా పెళ్లి చేసుకుంది. ఇదంతా విని సునీల్ కోపడ్డాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎలా జరుగుతుందని ఆగ్రహంగా అడిగాడు. దీంతో అక్కడ వాగ్వాదం జరిగింది. చివరికి పింకీ, ఆమె తల్లిదండ్రులందరూ కలిసి సునీల్ ను చితకబాదారు. దీంతో సునీల్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ తన భార్య, అత్తమామలపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు పింకీ రెండో వివాహం అధికారికంగా చెల్లుబాటు కాదని కేసు నమోదు చేసి సునీల్ ను కొట్టినందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.