Jamun Fruit: వేసవిలో మనకు ప్రత్యేకంగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి.. వీటిని జామున్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇవి రుచిలో వగరు, కాస్త తియ్యగా ఉండే నేరేడు పండు వేసవిలో విరివిగా లభిస్తుంది. ఈ సీజన్‌లో క్రమం తప్పకుండా నేరేడుని తింటే ఎన్నో సమస్యలు తొలగిపోయి, ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇక విత్తనాల పొడి తయారు చేసుకుని తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయిని నిపుణులు సూచిస్తున్నారు.
నేరేడు పెద్ద మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు సమస్యలు తొలగిపోతాయి. ఇందులోని పోషకాలు పేగులను ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియ సక్రమంగా నిర్వహించేలా ప్రోత్సహిస్తాయి. అలాగే మంచి జీర్ణక్రియ కోసం నేరేడుని ఉప్పుతో కలిపి తీసుకుంటే చాలా మంచిదంటున్నారు. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు పండు మంచిది.
జామున్ పండ్లలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే జీవక్రియను మెరుగుపడుతుంది. మీరు బరువు తగ్గాలని గట్టిగా అనుకుంటే రోజూ అల్పాహారం బెర్రీలు తినవచ్చు, నేరేడు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల తరచూ దప్పిక వేయడం, యూరిన్‌కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.
నేరేడులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: వాక్కాయాలోని ఔషద గుణాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..
జామున్ ఫ్రూట్‌లో ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. అలాగే నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. అంతేకాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.
నేరేడు పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెుటిమల సమస్యను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేసేందుకు సహాయపడతాయి. దీనితో పాటు నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి దృఢంగా మారుతుంది. మీ చర్మ రంగు సహజ కాంతితో వెలిగిపోవాలంటే వీటి గుజ్జును ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. సీజన్‌లో లభించే పండు కాబట్టి అందరు తినడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.