E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 28th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను కొత్త ఆఫీసుకు వెళ్లమన్న సుభాష్ 

Brahmamudi Serial Today November 28th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను కొత్త ఆఫీసుకు వెళ్లమన్న సుభాష్ 
Advertisement

Brahmamudi serial today Episode:  

అందరూ టిఫిన్‌ చేస్తుంటే.. అప్పు.. కళ్యాణ్‌కు తాను మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యేది చెప్పమని నసుగుతుంది. అది గమనించిన ధాన్యలక్ష్మీ ఏంట్రా ఏంటో గుసగుసలాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ అబ్బే ఏం లేదమ్మా అప్పును ఉప్మాతో పాటు ఇడ్లీలు కూడా వేసుకోమంటున్నాను మెత్తగా ఉంటాయి కదా అదే చెప్తున్నాను అంటాడు. దీంతో ఇంద్రాదేవి వెటకారంగా అవును పాపం ఇన్నాళ్లకు నువ్వు చెప్తే కానీ తెలియదు.. ఇడ్లీ మెత్తగా ఉంటాయి. గారె గట్టిగా ఉంటుందని అని చెప్పగానే.. అపర్ణ పోనీలే అత్తయ్యా ఏదో పెళ్లానికి త్వరగా డైజెస్ట్ కావడానికి ఇడ్లీ సజెస్ట్ చేసినట్టు ఉన్నాడు వాడు అని చెప్పగానే.. అవును చూస్తూనే ఉన్నాను.. పెళ్లాలకు కడుపులు వచ్చినప్పటి నుంచి పెళ్లాల చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారు.. కానీ ఈ నాన్నమ్మను మాత్రం అసలు పట్టించుకోవడమే మర్చిపోయారు అంటూ బాధపడుతుంది.

దీంతో రాజ్ ఇప్పుడు నీకేం అయింది నాన్నమ్మ అని అడగ్గానే.. ఇంద్రాదేవి కోపంగా అరే ఎంత సేపు నువ్వేమో పెళ్లామా నువ్వు ఈ జ్యూస్‌ తాగు.. పెళ్లామా ఫ్రూట్స్ తిను అంటావు. వాడేమో పెళ్లామా ఇడ్లీ వేసుకో.. పెళ్లామా సాంబారు పోసుకో అంటాడు.. కానీ నాన్నమ్మ  ఈ స్వీట్స్‌ తిను.. నాన్నమ్మ ఈ జ్యూస్‌ తాగు అని ఎప్పుడైనా అన్నావా..? అని అడగ్గానే.. నీకు ఒంటి నిండా షుగరు ఫ్యాక్టరీ ఉంది.. మళ్లీ ఈ స్వీట్స్‌ గోల ఏంటి నాన్నమ్మ నీకు అంటాడు రాజ్‌. ఇంతలో సుభాష్, రాహుల్‌కు కొత్త కంపెనీ గురించి చెప్పగానే.. రుద్రాణి నా కొడుకు ఎప్పుడు కొత్త కంపెనీకి ఎప్పుడు వెళ్లాలి.. ఎలా డెవలప్‌ చేయాలి.. అని ఆలోచిస్తున్నాడు.. తిండి కూడా మానేశాడు అన్నయ్య అని చెప్పగానే.. ఇంద్రాదేవి నవ్వుతూ అవును తినడమే మానేవాడు. ఇప్పుడు నీ కొడుకు చేతిలో ఉన్న దోశ నాలుగోది అని చెప్పగానే అందరూ నవ్వుతారు. సుభాష్‌.. రాహుల్‌ ఇక నుంచి స్వరాజ్‌ కంపెనీకి రావాల్సిన పని లేదు.. కొత్త కంపెనీకే వెళ్లు అని చెప్పగానే.. ఈరోజు నుంచే వెళ్తాను మామయ్య అని రాహుల్‌ చెప్తాడు.

Advertisement

సుభాష్‌ మళ్లీ రాజ్‌ను రాహుల్ ఇక కంపెనీకి రాడు కాబట్టి మన కంపెనీ పనులు నువ్వు చూసుకుంటేనే మంచిది అని చెప్పగానే.. తప్పకుండా డాడీ నేనే కాదు ఇక నుంచి కళావతి కూడా ఆఫీసుకు వస్తుంది. ఇద్దరం కలిసి ఆఫీసుకు వెళ్తాం అని చెప్పగానే.. అపర్ణ అదేంట్రా..? కావ్య ఆఫీసుకు రావడం ఏంటి..? ఇంట్లోనే రెస్ట్‌ తీసుకుంటుంది అని అడగ్గానే.. నేను అదే చెప్పాను కానీ తనే వినడం లేదు అంటాడు రాజ్‌. దీంతో ఇంద్రాదేవి నిన్నటి దాకా బకెట్‌ లిస్ట్‌ తీర్చావు కదా..? ఇప్పుడు ఇంకేదైనా లిస్ట్‌ తీసుకో అది తీర్చే పనిలో పడు బోరు కొట్టదు అని చెప్పగానే.. అదేంటి నాన్నమ్మ అలా మాట్లాడతావు అన్నయ్య వదిన చెప్పింది కరెక్టే అంటూ మేము అలా బయటకు వెళ్తాము అని చెప్పగానే.. ధాన్యలక్ష్మీ బయటకు వెళ్లి ఏం చేస్తారు అని అడుగుతుంది. అప్పు స్టేసన్‌ కు వెళ్తుంది. నేను పక్కనే ఉంటాను అని కళ్యాణ్‌ చెప్పగానే.. ధాన్యం తిడుతూ.. కడుపుతో ఉన్న అమ్మాయి డ్యూటీ ఎలా చేస్తుంది అని ప్రశ్నించగానే.. రాహుల్‌ సరే అమ్మ నువేవ రైట్‌ అని చెప్తాడు. దీంతో అప్పు కోపంగా రాహుల్‌ను చూస్తుంది.

తర్వాత కళ్యాణ్‌, అప్పు బయటకు వెళ్లి మాట్లాడుకుంటుంటే.. కావ్య వెళ్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పు స్టేషన్‌లో పాప మిస్సింగ్‌ గురించి చెప్తుంది. కానీ కావ్య ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళితే గొడవ జరుగుతుంది అని చెప్తుంది కావ్య. ఇంతలో రాజ్‌ వచ్చి మీ వెనక మేమున్నాం.. ఈ కేసు పూర్తి అయ్యే వరకు ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్తాడు. తర్వాత రూంలోకి వెళ్లిన రాజ్‌తో కావ్య గొడవ పడుతుంది అప్పు వాళ్లకు ఎందుకు ఆ సలహా ఇచ్చారని నిలదీస్తుంది. దీంతో ఓ తల్లికి సాయం చేయడం తప్పు కాదు ఏమీ కాదులే అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత కావ్య, రాజ్‌ ఆఫీసుకు వెళ్తుంటే అందరూ జాగ్రత్తలు చెప్తుంటారు. ఒక్కోక్కరు ఒక్కో మాట చెప్తుంటే.. సుభాష్‌ కోపంగా అబ్బా వాళ్లు వెళ్లేది ఆఫీసుకా..? అంతరిక్షానికా అంటాడు. ఇంతలో కావ్య, రాజ్‌ వెళ్తారు. వాళ్లను చూసిన కళ్యాణ్‌ అప్పుతో పొట్టి ఇదే మంచి టైం వెంటనే ఏదో ఒకటి చెప్పి మనం ఎస్కేప్ కావాలి అని చెప్తాడు. అది సరే కూచి నీ బ్యాగులో నా యూనిఫామ్‌ ఉంది అది అత్తయ్య చూసిందో మన పని పట్‌ అంటుంది. చూడకుండా మేనేజ్‌ చేద్దాం పొట్టి నువ్వు రా అంటూ ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు. ధాన్యలక్ష్మీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గానే.. గుడికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్తుంటే.. ధాన్యలక్ష్మీ కళ్యాణ్‌ను ఆపి నీ భుజానికి ఆ బ్యాగ్‌ ఏంటి అని అడగ్గానే.. కళ్యాణ్‌ షాక్‌ అవతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×