BigTV English

Rajasekhar: అందుకే శ్రీదేవిని కాకుండా జీవితను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… రాజశేఖర్ వైరల్ కామెంట్స్!

Rajasekhar: అందుకే శ్రీదేవిని కాకుండా జీవితను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… రాజశేఖర్ వైరల్ కామెంట్స్!

Rajasekhar: యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ (Rajasekhar) తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. తెలుగులో పలు సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఒకపక్క యాక్షన్ మూవీస్ లో నటిస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా చాలామంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా కెరియర్ పీక్స్ లో ఉండగానే జీవిత (Jeevitha) ను వివాహం చేసుకొని, లైఫ్ లో సెటిల్ అయిపోయారు రాజశేఖర్. వాస్తవానికి అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తో రాజశేఖర్ కు వివాహం జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మరొకసారి గుర్తు చేసుకున్నారు.


యాక్సిడెంట్ కంటే ముందే మా బంధం బలపడింది – రాజశేఖర్

ఇంటర్వ్యూలో భాగంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. 1991లో మగాడు సినిమా చేస్తున్న సమయంలో అనుకోకుండా గాయాల పాలయ్యాను.. అప్పుడే తమ మధ్య బంధం బలం అయిందని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ ..మగాడు సినిమా కంటే ముందే మా మధ్య బంధం ఏర్పడింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన యాక్సిడెంట్ మమ్మల్ని ఒక్కటి చేసింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటాను అన్నప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు మా అమ్మ నాన్న ఊర్లో లేరు. అప్పుడు జీవిత హాస్పిటల్ లో నన్ను దగ్గరుండి మరీ చూసుకుంది.వారు హాస్పిటల్ కి చేరుకున్నప్పుడు కూడా వారికి ఎటువంటి పని చెప్పకుండా అన్ని జాగ్రత్తలు తానే తీసుకుంది. ఆ సమయంలో రెండు ఆపరేషన్లు జరగగా.. దాదాపు 30 రోజులపాటు నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా మా అమ్మ నాన్నకు ఏమాత్రం బరువ లేకుండా జీవితానే నన్ను జాగ్రత్తగా చూసుకుంది.


పెళ్లి కాకముందే కాపురం పెట్టేశాం – రాజశేఖర్

ఎప్పుడైతే నేను గాయాలతో హాస్పిటల్ లోకి అడుగుపెట్టానో .. మళ్ళీ తిరిగి డిస్చార్జ్ అయ్యే వరకు కూడా జీవిత నా దగ్గరే ఉండి, ఆ తర్వాత కూడా తను తన ఇంటికి వెళ్లకుండా నేరుగా మా ఇంటికి వచ్చింది. ఇక ఆ తర్వాత కూడా ఆరు నెలల పాటు మా ఇంట్లోనే ఉంది. అక్కడే ఇంక ఆమెను పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి కాకముందు కూడా జీవితను కోడలు అని మా నాన్న అందరికీ పరిచయం చేశారు. పెళ్లికి ముందే మా కాపురం మొదలైంది అంటూ రాజశేఖర్ తెలిపారు.

అందుకే శ్రీదేవిని కాదని జీవితను వివాహం చేసుకున్నా – రాజశేఖర్

శ్రీదేవిని కాదని జీవితను వివాహం చేసుకున్నారని అంటూ ఉంటారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే.. “జీవిత మనసు నాకు తెలుసు. కానీ శ్రీదేవి పై నాకు ఎటువంటి ప్రేమ లేదు. నిజానికి ఆమె అందాన్ని చూసి నేను ఇష్టపడ్డాను. అప్పుడేమో మా తల్లిదండ్రులు ఆమెని ఇష్టపడుతున్నాను అనుకున్నారు. కానీ నాకు జీవితతో బంధం బలం అయింది. అందుకే శ్రీదేవిని కాదని నేను జీవితను వివాహం చేసుకోవాల్సి వచ్చింది” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు రాజశేఖర్. మొత్తానికి అయితే శ్రీదేవిని కాదని జీవితను చేసుకున్నారు అనే రూమర్స్ క్రియేట్ చేసే వారికి రాజశేఖర్ ఒక్క మాటతో చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.

ALSO READ:Pawan Kalyan HHVM : హరిహర వీరమల్లుపై నెగిటివ్ కాంపెయిన్… ఆ ముగ్గురు హీరోల ఫ్యాన్స్ పగబట్టేశారు!

Related News

Jana Nayagan : పొంగల్ బరిలో పొలిటికల్ సినిమా, మలేషియాలో ఆడియో లాంచ్

Shankar : హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కొడుకు, డైరెక్టర్ ఎవరంటే?

Coolie: కూలీ సినిమాలో ఆ ఇద్దరి యంగ్ హీరోల కామియో, లోకేష్ మెంటల్ మాస్ ట్విస్ట్

Manchu Vishnu: హీరోయిన్‌లకు ‘మా’ కండిషన్స్.. SIIMAపై నటి ఫిర్యాదుతో విష్ణు కీలక ప్రకటన

Actor Balakrishna:కార్మికుల సమస్యలపై స్పందించిన బాలయ్య… నిర్మాతలకు కీలక సూచనలు!

Telugu film industry : షూటింగుకు వెళ్లాడని కాస్ట్యూమర్ ని కొట్టిన యూనియన్ సెక్రటరీ, నిర్మాత ఎస్కేఎన్ రియాక్షన్

Big Stories

×