Nephew Love Affair| ఒకరి పట్ల మరొకరికి గౌరవం, నమ్మకం ఆధారంగా ఆలుమగల బంధం సాగుతుంది. కానీ ఆ బంధంలో అనుమానం, ద్రోహం అనేవి చొరబడితే అనర్థాలు జరుగుతాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. భార్య మరో యువకుడితో సంబంధం కలిగి ఉందని అనుమానంతో ఒక భర్త ఆధారాలతో పట్టుకోవాలని చూశాడు. కానీ ఈ విషయం తెలిసిన ఆ భార్య మరో యువకుడితో కలిసి తన భర్తను చంపేసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా లక్ష్మణ్ ఖేడా గ్రామానికి చెందిన ధీరేంద్ర అనే 34 ఏళ్ల యువకుడికి 6 ఏళ్ల క్రితం రీనా (31) అనే యువతితో వివాహం జరిగింది. ధీరేంద్ర ఒక ట్రాక్టర్ డ్రైవర్. వీరిద్దరికీ పిల్లలు లేరు. అయినా ధీరేంద్ర తన భార్యతో చాలా ప్రేమగా ఉండేవాడు. కానీ రీనా మాత్రం తన దాంపత్య జీవితం పట్ల అసంతృప్తితో ఉండేది. ఈ క్రమంలో రీనా పుట్టింటి నుంచి ఆమె మేనల్లుడు సతీష్ అదే గ్రామానికి వచ్చాడు. అక్కడ తన మేనత్త భర్త ధీరేంద్ర వద్ద పని కోసం వచ్చి.. వారి ఇంట్లోనే ఉండేవాడు.
అయితే రీనా తన సొంత మేనల్లుడితో సంబంధం పెట్టుకుంది. వారిద్దరి పట్ల ప్రారంభంలో ధీరేంద్ర అనుమానించలేదు. కానీ ఒక రోజు వారిద్దరూ మరీ చనువుగా ఉండడం చూసి తన భార్యపై కోపడ్డాడు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఒకరోజు వారిద్దరు పడకగదిలో ఉండగా ధీరేంద్ర చూశాడు. ఆ తరువాత సతీష్ ని కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. తన భార్యను కూడా చితకబాది వెళ్లిపోయాడు. ఆ తరువాత ఇంట్లో సతీష్ వస్తే తనకు తెలియడానికి సీసిటీవి కెమెరాలు అమర్చాడు.
ఈ కెమెరాలు చూసి రీనాకు కోపం వచ్చింది. ఇకపై తన కోరికలు తీర్చుకోవడానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. ఆ అడ్డుని తొలగించడానికి ఒక ప్లాన్ వేసింద. తన మేనల్లుడు సతీస్ ని పిలిచి.. రాత్రి ఇంటికి రావాలని చెప్పింది. రాత్రి ధీరేంద్ర ఇంటికి వచ్చాక.. అతని భోజనంలో మత్తు మందు కలిపింది. ధీరేంద్ర స్పృహ కోల్పోయాక రీనా, సతీస్ అతడిని కర్రలతో చితరబాదారు. ఆ దెబ్బలకు ధీరేంద్ర మరణించాడు. అయితే రీనా పోలీసులను తప్పుదారి పట్టించడానికి మరో నాటకం ఆడింది. ధీరేంద్ర శవం ముందు కూర్చొని గట్టిగా ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని, పక్కింటి వారు అక్కడికి రాగానే ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది. పక్కింటి వారితో ఇంతకుముందు ధీరేంద్రకు ఒకసారి గొడవ జరిగింది.
Also Read: ఆటోడ్రైవర్ హంతకుడు.. అతని ఆటోలో ఎక్కితే మృత్యులోకానికే
పోలీసులు అక్కడికి రాగానే ఆ పక్కింటి వారే తన భర్తన చంపేశారని చెప్పింది. దీంతో పోలీసులు ఆమె మాటలు నమ్మి.. పక్కింటి వారిని అరెస్ట్ చేశారు. కానీ ధీరేంద్ర పోస్ట్ మార్టం నివేదికలో అతడికి మత్తు మందు ఇచ్చారని తెలియగానే పోలీసులకు అతడి భార్య రీనాపై అనుమానం కలిగింది. పైగా ఆ పక్కింటి వారు సతీష్, రీనాల మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సతీష్ ని అదుపులోకి తీసుకొని తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అతను మొత్తం చెప్పేశాడు. తన మేనత్త చెప్పినట్లు మాత్రమే చేశానని.. తాను హత్య చేయాలనుకోలేదని చెప్పాడు.
పోలీసులు సతీష్ వాంగ్మూలంతో రీనాని మే 18, 2025న అరెస్ట్ చేసి.. వారిద్దరిపై ధీరేంద్ర హత్య కేసు నమోదు చేశారు.