Malayalam Movies on OTT : ఓటిటి ప్లాట్ ఫామ్ లో జనవరి నెలలో సినిమాల సందడి కొనసాగుతోంది. థియేటర్లలో మంచి విజయాలను నమోదు చేసుకున్న మలయాళం సినిమాలు, ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎప్పటినుంచో చూడాలని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్, ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాలను చూడవచ్చు. ఏ ఓటిటిలో, ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (All We Imagine As Light)
2024 లో వచ్చిన ఈ మూవీకి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కుశృతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్ నటించారు. హిందీ, మలయాళం, మరాఠీ భాషలలో చిత్రీకరించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ’ 2024 మే 23న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శించబడింది. మలయాళంలో 2024 సెప్టెంబరు 21న విడుదలై సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ January 3, 2025 నుండి డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐ యామ్ కథలన్ (I am khadalan)
2024లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి గిరీష్ A. D. దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నస్లెన్ కె. గఫూర్, అనీష్మా అనిల్‌కుమార్, లిజోమోల్ జోస్, దిలీష్ పోతన్, వినీత్ వాసుదేవ, సజిన్ చెరుకైల్ నటించారు. ఈ మూవీకి సంగీతం సిద్దార్థ ప్రదీప్ అందించారు. నవంబర్ 7, 2024న థియేటర్లలో విడుదలైన ‘ఐ యామ్ కథలన్’ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ లో ప్రేమించిన అమ్మాయికోసం చాలా సమస్యలు ఎదుర్కొంటాడు హీరో. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మనోరమ మాక్స్ (Manorama Max) లో January 3, 2025 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
ముర (Mura)
2024లో విడుదలైన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించారు. ఇందులో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, క్రిష్ హాసన్, మాలా పార్వతి, కని కృతి నటించారు. అల్లరిగా తిరిగే కుర్ర బ్యాచ్ పెద్ద రౌడీ గ్యాంగ్ లో చేరుతారు. వీళ్ళు ఎదుర్కునే సవాళ్ళతో మూవీ రన్ అవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 25 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
సూక్ష్మ దర్శిని (Sukshma darshini)
2024లో విడుదలైన సూక్ష్మదర్శిని అనే మలయాళం కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి M. C. జితిన్ దర్శకత్వం వహించారు. హ్యాపీ అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏవీఏ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ నటించారు. కొత్తగా పక్కింట్లోకి వచ్చిన ఫ్యామిలీలో తల్లి కనబడకుండా పోతుంది. కొడుకు మీద అనుమానంతో హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 (Zee5) లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.