E-Paper
Advertisement

అమ్మాయితో ప్రేమాయణం.. ఆంటీతో సహజీవనం, ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ఏం చేశాడంటే

అమ్మాయితో ప్రేమాయణం.. ఆంటీతో సహజీవనం,  ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ఏం చేశాడంటే
Advertisement

Manyam district Crime: సహజీవనం.. పచ్చని సంసారంలో మంటపెట్టడమే కాదు.. అన్నెం పుణ్యం తెలియని యువతులు బలైపోతున్నారు. ఓ యువకుడు.. అమ్మాయిని ప్రేమిస్తూనే..  ఆంటీ సహజీవనం మొదలుపెట్టాడు. ఫలితంగా ఒత్తిడి పెరిగి ఆ యువకుడు అమ్మాయిని దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం

Advertisement

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాలకొండ మండలం సీతంపేటకు చెందిన ఉషారాణికి సింగాపురానికి చెందిన 25 ఏళ్ల భువనేశ్వర్ యువకుడితో పరిచయం ఏర్పడింది. గతంలో వీరిద్దరూ గ్రామ వాలంటీర్లుగా పని చేశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అది కాస్త ప్రేమగా మారింది.

సీన్ కట్ చేస్తే.. భవనేశ్వర్ ఓ వైపు ఉషారాణితో ప్రేమ కంటిన్యూ చేస్తూనే సింగుపురం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్న ఓ మహిళకు దగ్గరయ్యాడు. సదరు మహిళకు వివాహం జరిగింది, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. ఐనప్పటికీ వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర బంధానికి దారి తీసింది. స్టాప్ నర్సుతో వివాహేతర సంబంధం కొనసాగుతోందన్న విష‌యం ప్రియురాలికి తెలిసింది.

Advertisement

అమ్మాయితో ప్రేమ.. ఆంటీతో సహజీవనం,  ఆ యువకుడు ప్రియురాల్ని చంపేశాడు

సదరు మహిళతో సంబంధం తెంచుకోవాల‌ని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని భువ‌నేశ్వ‌ర్ ను ఒత్తిడి చేసింది ఉషారాణి. ఆ తర్వాత ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు తీవ్రమయ్యాయి. ఆ యువ‌తిని ఎలాగైనా అడ్డు తొల‌గించుకోవాల‌ని డిసైడ్ అయ్యాడు. అందుకోసం స్టాఫ్ నర్స్‌ మహిళతో కలిసి ప్లాన్ చేశారు.

ప్రియురాలికి నిద్ర‌ మాత్రలు ఇస్తే సుల‌భంగా చ‌నిపోతుంద‌ని చెప్పి అత‌డికి వాటిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ ఆరున ఫోన్ చేసి రాయిఘ‌డ్ ఆల‌యానికి ద‌ర్శ‌నానికి వెళ‌దామ‌ని చెప్పి ఉషారాణిని పిలిచాడు. ప్రియుడి మాటలు నమ్మిన యువతి, కారులో వెళుతుండ‌గా నిద్ర‌మాత్ర‌లు క‌లిపిన కూల్ డ్రింక్ ప్రియురాలికి ఇచ్చాడు.  మ‌త్తులోకి జారుకున్న ఉషారాణిని ముక్కు, నోరు మూసేసి చంపేశాడు.

ALSO READ: మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో మృతి 

ఆ తర్వాత డెడ్‌బాడీని రాయికి క‌ట్టి చెరువులో పడేశారు. మ‌రుస‌టి రోజు ఉషారాణి త‌ల్లిదండ్రులు కూతురు క‌నిపించ‌డంలేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ రోజు సాయంత్రానికి యువతి డెడ్ బాడీ చెరువుతో కనిపించడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ కేసు దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. చివరకు నిందితులు భువ‌నేశ్వ‌ర్‌తోపాటు సహజీవనం చేస్తున్న మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×