E-Paper
Advertisement

Hyderabad Weather: హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం.. ఒకే రోజులో రెండు సీజన్లు..!

Hyderabad Weather: హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం.. ఒకే రోజులో రెండు సీజన్లు..!
Advertisement

Hyderabad Weather: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, ఇప్పటి వరకు తొలకరి జల్లులు పలకరించినా, హైదరాబాద్ నగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు మాత్రం చాలా నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఈ నెల 9వ తేదీన కేవలం గంట సమయంలోనే ఏకంగా పది సెంటీమీటర్ల వర్షం కురిసి నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. దీనికి తోడు శుక్రవారం రాత్రి కూడా దాదాపు గంట సేపు వర్షం దంచి కొట్టింది. తాజాగా శనివారం సాయంత్రం నుంచి నగరంలో చిరు జల్లులు కురుస్తూ ఒక్కసారిగా వాతావరణం బాగా చల్లబడింది.

నెమ్మదిగా తగ్గుతూ..

కానీ రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో మూడు సార్లు వర్షం కురిసినా, పగటి పూత వాతావరణంలోని వేడి చాలా నెమ్మదిగా తగ్గుతుంది. శనివారం హైదరాబాద్ నగరంలో సాయంత్రం అయిదు గంటల కల్లా గరిష్టంగా అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత సికిందరాబాద్ పాటిగడ్డ ఏరియాలో నమోదు కాగా, అత్యల్పంగా 35.3 డిగ్రీలు పాతబస్తీలోని సులేమాన్ నగర్ లోని సెట్విన్ ట్రెయినింగ్ సెంటర్ ఆవరణలో నమోదైనట్లు టి గడ్డ ప్రాంతంలో అత్యల్పంగా 33. 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Also read: Heavy Rains: హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

ఒక రోజు రెండు సీజన్‌లు..

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు రెండు సీజన్ల వాతావరణం కనన్పిస్తుంది. ముఖ్యంగా నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచే ఎండలు దంచి కొడుతూ మధ్యాహ్నాం ఒంటి గంట కల్లా రోడ్లపై వేడి గాలులు బాగా పెరుగుతున్నాయి. ఇక సాయంత్రం అయిదు గంటల తర్వాత సిటీలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈదురు గాలుల కారణంగా వర్షం కురిసినపుడల్లా దాదాపు 40 నుంచి 50 ఏరియాల్లో చెట్లు విరిగి పడుతుండటం, అవి విద్యుత్ వైర్ల పడటంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా కూడా నిలిచిపోతుంది. పగలు వేడి గాలులు వీస్తున్నా, రాత్రి పూట చల్లటి గాలులతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

Advertisement

Also read: BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Related News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

తెలంగాణ విద్యార్థులకు బంపరాఫర్.. నెలకు రూ.1000, ఇంకెందుకు ఆలస్యం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

బోర్డర్ చెకింగ్ పేరిట వసూళ్లు.. లారీ డ్రైవర్‌ స్టింగ్ ఆపరేషన్, వెలుగులోకి తెచ్చిన ‘బిగ్‌టీవీ’

ఫలించని ట్రీట్‌మెంట్..BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి, కేసీఆర్ సంతాపం

తుర్కపల్లి తండాలో సాంప్రదాయ తీజ్ పండుగ సంబరాలు..!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఐదుసార్లు దాడి.. ట్రెయినీ ఐపీఎస్ కేసులో సంచలనాలు!

తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

Big Stories

Advertisement
×