Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులు మరియు ప్రత్యేకమైన తేదీలలో పుట్టిన వారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలట. లేదంటే ఎన్నో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు వేద జ్యోతిష్య పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏంటో వారు ఎదుర్కోబోయే కష్టాలు నష్టాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చంద్ర ప్రభావిత తేదీలలో పుట్టిన వారు: రెండు, పదకొండు, ఇరవై, ఇరవై తొమ్మిది తేదీలన్నీ చంద్ర గ్రహ ప్రభావితమైన తేదీలు అంటారు. అ తేదీలలో పుట్టిన జాతకులు ఎప్పటికీ ఆల్కాహాల్ జోలికి పోకూడదట. ఒకవేళ మందు తాగినట్లయితే వీరికి భావోద్వేగం పెరిగిపోయి కంట్రోల్ తప్పుతారట. తాగితే వీరు డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. అలాగే వీరు ఎప్పుడూ చికాకు పడుతూ జీవితం మీద విరక్తి చెందుతారట.
కేతు ప్రభావిత తేదీలలో పుట్టిన వారు: ఏడు, పదహారు, ఇరవై అయిదు తేదీలలో పుట్టిన వారు కేతు ప్రభావిత జాతకులు అంటారు. ఈ జాతకులు కూడా ఆల్కహాల్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట. మందు తాగటం వల్ల వీరిలో లోతైన ఆలోచనలు వచ్చి ఏం చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితికి వెళ్లిపోతారట. ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా అస్పష్టంగా ఉంటారట. ఇంకా వీరిలో భయాందోళనలు, చికాకు పెరిగిపోతాయట.
కుజ ప్రభావిత తేదీలలో పుట్టినవారు: తొమ్మిది, పద్దెనిమిది, ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారు కుజ ప్రభావిత జాతకుల కిందకు వస్తారు. వీరు ఆల్కాహాల్ తీసుకుంటే కోపోద్రిక్తులుగా మారిపోతారు. గొడవలు, తగాదాలు చేస్తూ ఘర్షణలకు దిగుతారు. ఒక్కోసారి మందు తాగాక ఏమీ అర్థం కాక తికమకపడుతుంటారు.
జాతకంలో ప్రమాదకర గ్రహస్థితులు: ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి వాళ్లు ఆల్కాహాల్ తీసుకుంటే మానసికంగా కుంగిపోతారు. అస్థిరమైన ఆలోచనలతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోతారు. అయితే వీరికి ఎక్కువగా ఆల్కాహాల్ పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. అది నియంత్రించుకుంటే వీరి జీవితం సాఫీగా సాగుతుందట.
ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహుగ్రహ ప్రభావం ( 6,8,12వ భావాల్లో) ఉంటుందో అటువంటి వారు మాయలో పడిపోతుంటారు. వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. దురలవాట్లకు అలవాటు పడి సమాజంతో చెడు ముద్ర వేసుకుంటారు.
ఎవరి జన్మకుండలిలో అయితే ఆరు, ఎనిమిది, పన్నెండవ స్థానాలు బలహీనంగా ఉంటాయో వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. బయటకు చెప్పుకోలేని చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతారు.
అశ్లేష, జ్యేష్ట, మూల నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉన్న జాతకులు జీవితాలు కూడా ఆల్కహాలు తీసుకోవడం వల్ల శక్తివంతమైన మార్పులు చోటు చేసుకుంటాయట. అలాగే వారికి స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు.
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు కూడా మంగళవారం, శనివారం నాన్‌వెజ్ తినడం, మద్యం సేవించడం లాంటివి చేయకూడదట. అలా చేయడం వల్ల క్రూర గ్రహాలైన కుజ, శనిల నుంచి ప్రతికూల శక్తులు ప్రేరేపించడబతాయి. దీని వల్ల వైవాహిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర దురదృష్టాలకు దారి తీస్తుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు