BigTV English

Sunitha Williams : 9 నెలల అంతరిక్ష జీవితం… త్వరలోనే తెర మీదకు సునీతా విలియమ్స్ బయోపిక్

Sunitha Williams : 9 నెలల అంతరిక్ష జీవితం… త్వరలోనే తెర మీదకు సునీతా విలియమ్స్ బయోపిక్

Sunitha Williams :సునీత విలియమ్స్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది.. భారత సంతతికి చెందిన అమెరికన్ అంతరిక్ష వ్యోమగామి సునితా విలియమ్స్.. ఎనిమిది రోజుల పాటు కొనసాగాల్సిన మిషన్ లో పాల్గొన్న ఈమె.. అనుకోకుండా సాంకేతిక సమస్యల కారణంగా తన టీమ్ తో కలిసి దాదాపు 9 నెలల పాటు స్పేస్ స్టేషన్ లోనే గడపాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈమెను భూమిపైకి తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందులో భాగంగానే నాసా – స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ -10 మిషన్ ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ – 9 రాకెట్ మార్చి 15 శనివారం నాడు కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా.. ఇప్పుడు ఒక్కొక్కరిగా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఇక వీరికి సునీత, బుచ్ విల్మోర్ స్వాగతం పలికారు. ఇక ఆపరేషన్ కూడా సక్సెస్ కావడంతో సునీత మార్చి 19వ తేదీన అంతరిక్షం నుండి బయలుదేరినట్లు నాసా ప్రకటించగా.. ఆ షెడ్యూల్ ని ఒకరోజు ముందుకు మార్చి 18న అనగా నేడు ఆమె అక్కడినుండి బయలుదేరి.. రేపు తెల్లవారుజాముకల్లా ఆమె భూమి మీదకి చేరుకోనున్నారు. ఇక ఈమె రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.


త్వరలో సునీత విలియమ్స్ బయోపిక్..

ఇలాంటి సాహసోపేతమైన అంతరిక్ష యాత్రను చేపట్టి, అందరికీ స్ఫూర్తిగా నిలిచిన సునీత విలియమ్స్ జీవితాన్ని ఇప్పుడు సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. సునీత విలియమ్స్ జీవితం, 8 రోజుల కోసం అని అంతరిక్షానికి వెళ్లి.. 9 నెలలపాటు చిక్కుకుపోయిన ఆమె అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే విషయాలను ఈ బయోపిక్ లో పొందపరుచనున్నారట. ఇకపోతే ఇప్పటికే కొంతమేరకు ఉన్న సమాచారంతో రచయితలు, దర్శకులు తమ కలాలను పదును పెడుతున్నారని, ఇదే నిజమైతే ఆమె జీవితంతో ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించడం ఖాయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.


Nidhhi Agerwal: ఛీ ఛీ… నిధి అగర్వాల్‌కు ఏం పోయే కాలం… ఇక అరెస్టే..!

సునీత విలియమ్స్ ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం..

సునీత విలియమ్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా.. గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఈమె తండ్రి న్యూరో అనామిస్ట్ గా వైద్య వృత్తిని కూడా కొనసాగించారు. సునీత విలియమ్స్ తల్లి ఉర్సులైన్ బోని పాండ్యా.. ఈమె స్లోవేకియాకు చెందినవారు. వీరికి సునీత, జేయ్ థామస్, దినా ఆనంద్ సంతానం. ఈమె 1965 సెప్టెంబర్ 19వ తేదీన ఒహియోలో జన్మించారు. 1983లో హై స్కూల్ విద్యను పూర్తి చేయగా.. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుండి ఫిజికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్ డిగ్రీ అందుకున్న ఈమె ప్రస్తుత వయసు 59 ఏళ్ళు. అత్యధిక స్పేస్ వాక్స్ సాధించిన ఆస్ట్రోనాట్ గా కూడా రికార్డు సృష్టించారు.

భూమి మీదకు చేరుకోనున్న సునీత విలియమ్స్..

ఇక సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లిన మిషన్ విషయానికి వస్తే.. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో తన సహచరుడు అయిన బుచ్ విల్మోర్ తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆమె చేరుకున్నారు. ఇక ప్లాన్ ప్రకారమే వారం రోజులకే భూమికి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. వీరిద్దరూ లేకుండానే ఆ వ్యోమ నౌక భూమికి తిరిగి వచ్చింది. దాంతో వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే చిక్కుకుపోయారు. ఇక వీరిని భూమి మీదకు తిరిగి తీసుకురావడానికి 9 నెలల సమయం పట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నౌక బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాలలో దిగనుంది. అలా దిగిన వ్యోమ నౌక నుంచి వారిని సహాయ బృందాలు బయటకు తీసుకొస్తారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×