E-Paper
Advertisement

Deeparadhana:వెండి కుందిలో దీపారాధన చేస్తున్నారా….

Deeparadhana:వెండి కుందిలో దీపారాధన చేస్తున్నారా….
Advertisement

Deeparadhana:హిందువుల్లో చాలా మంది ప్రతి రోజు దేవుని దగ్గర దీపం పెడుతూ ఉంటారు. సాధారణంగా మనం ప్రతి రోజు దేవునికి దీపారాధన వెండి కుంది లేదా ఇత్తడి కుందిలో చేస్తూ ఉంటాం. కొంత మంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. ఇలా ఎవరి స్తోమతని బట్టి, వీలుని బట్టి దీపారాధన చేస్తుంటారు. అయితే ప్రతీ రోజు వెండి కుందిలో ఏ దేవుని ముందు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వెండి కుందులతో దీపారాధన వల్ల మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అనుకున్న కోరికలు ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు. అలానే వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే జ్ఞానం ప్రసాదిస్తుంది

వెండి కుందిలో నెయ్యి వేసి మంగళవారం కుజ గ్రహం ముందు వెలిగిస్తే బీపీ కంట్రోల్ అవుతుంది. వెండి కుందిలో నెయ్యి వేసి బుధవారం బుధగ్రహం ముందు వెలిగిస్తే మంచి బుద్ది కలుగుతుంది. వెండి కుందిలో నెయ్యి వేసి గురువారం గురు గ్రహం వద్ద వెలిగిస్తే ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. వెండి కుందిలో నెయ్యి వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే అజ్ఞానం పోయి జ్ఞానము వస్తుంది. వెండి కుందిలో నెయ్యి వేసి లక్ష్మి దేవి ముందు వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి చంద్రుని ముందు వెలిగిస్తే చంచల స్వభావం పోయి స్థిరత్వం వస్తుంది. వెండి కుందిలో నెయ్యి వేసి శుక్రవారం శుక్ర గ్రహం వద్ద వెలిగిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి శనివారం శనిగ్రహం వద్ద వెలిగిస్తే గుప్త రోగాలు నయం అవుతాయి.

Advertisement

వెండి దీపాలలో నెయ్యి వేసి గణపతి ముందు వెలిగిస్తే ఇష్టకార్య సిద్ది కలుగుతుంది. సరస్వతి దేవి ముందు వెలిగిస్తే , మనలోని అజ్ఞానం పోతుంది. సరస్వతి దేవి కటాక్షం కలుగుతుంది. వెండి దీపాలు మహాలక్ష్మి దేవి ముందు వెలిగిస్తే దారిద్ర్యం పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చంద్రుని ఎదుట వెండి దీపాలు వెలిగిస్తే ముఖంలో కాంతి వచ్చి, తేజోవంతులుగా మారుతారు. చంచల దోషం పోయి మనసు స్థిరత్వం ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×