BigTV English

Astrology:  ఏ వారంలో పుడితే కోటీశ్వరులు అవుతారో తెలుసా..? అందులో మీ పుట్టిన వారం ఉందేమో చూసుకోండి

Astrology:  ఏ వారంలో పుడితే కోటీశ్వరులు అవుతారో తెలుసా..? అందులో మీ పుట్టిన వారం ఉందేమో చూసుకోండి

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన వారాన్ని  బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు పండితులు. అయితే ఏ వారంలో  పుట్టిన వాళ్లు అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు తెలుస్తుందాం.


ఆదివారం:

ఆదివారం పెట్టిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. దాని వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆదివారం పుట్టిన వారికి కొన్ని కష్టాలు దాటిన తర్వాత అదృష్టం వస్తుంది.  తల్లిదండ్రులను గౌరవిస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉన్నా ప్రేమ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఆదివారం పుట్టిన వారికి పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తుంది. వీరికి తెలుపు రంగు కలిసొస్తుంది.


సోమవారం:

సోమవారం పుట్టిన వారిక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఎవ్వరినీ పట్టించుకోరు. వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు వినరు. వీరికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయానికి ఆలోచికస్తారు. సోమవారం పుట్టిన వారు ఎప్పుడూ గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.   సోమవారం పుట్టిన వారికి అధిపతి చంద్రుడు కాబట్టి రాబోయే రోజుల్లో సమస్యలు తొలగిపోతాయి. వీరికి పరమశివుణి ఆశ్శీస్సుల ఉంటాయి. అందువల్ల వీల్లు ధనవంతులు అవుతారు. వీరికి అదృష్టసంఖ్య మూడు. కలిసొచ్చే రంగు నీలం.

మంగళవారం:

మంగళవారం పుట్టిన వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరు చాలా బలహీనంగా ఉంటారు. ఏ పని ఎక్కువగా చేయరు. వారిని వారే తక్కువ అంచనా వేస్తుకుంటారు. అందరితో కలిసి ఉండటానికే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. మంగళవారం పుట్టిన వారు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఎంత డబ్బు వచ్చినా నిలవదు. అనుకున్న పనులు టైంకు జరగవు. వీరు అనుకున్నట్టు వీరి జీవితం ఉండదు. వీరి అదృష్ట సంఖ్య రెండు. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు.

బుధవారం:

బుధవారం పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఏ పని చేయడానికైనా ముందుంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోపం తక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తారు. అయితే వీరు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. బుధవారం పుట్టిన వారికి గణపతి ఆశీస్సులు ఉంటాయి. వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరు జీవితంలో ఎప్పటికైనా ధనవంతులు అవుతారు. వీరికి అదృష్ట సంఖ్య అయిదు. అలాగే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

గురువారం:

గురువారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి ఆవేశ పడతారు. తర్వాత ఆలోచిస్తారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో వీరికి కొన్ని కష్టాలు ఉంటాయి. వీరి కష్టాలు బాధలు ఎవ్వరికీ చెప్పరు. అదృష్టం తక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు టైంకు జరగవు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే జీవితంలో ఒక దశ దాటిన తర్వాత డబ్బు బాగా సంపాదిస్తారు. గురువారం పుట్టిన వారికి బాబా ఆశీస్సులు ఉంటాయి. వీరికి సూర్యుడు అధిపతి. వీరికి అదృష్ట సంఖ్య నాలుగు. వీరికి బాగా కలిసి వచ్చే రంగు పసుపు.

శుక్రవారం:

శుక్రవారం పుట్టిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. జాలి దయ ఎక్కువగా ఉంటాయి. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఎవరికీ అన్యాయం చేయరు. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. వీరి జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి మాటలకు అందరూ పడిపోతారు. ఒకరికి ఇబ్బంది పెట్టే గుణం ఉండదు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. శుక్రవారం పుట్టిన వారికి అదృష్టం వెంటనే ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అందువల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు. వీరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కోటీశ్వరులు అవుతారు. వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది. వీరికి బాగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

శనివారం:

శనివారం పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఏ పని చేసినా నష్టాలు వస్తుంటాయి. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. వారికి శని అధిపతి కాబట్టి వీరి జీవితం మామూలుగా ఉంటుంది. అదృష్ట సంఖ్య ఆరు. కలిసి వచ్చే రంగు నలుపు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్‌ టీవీ సొంతంగా క్రియేట్‌ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×